స్టార్ మా వారు ఈ మధ్య ‘కుకు విత్ జాతిరత్నాలు’ ఈ మధ్య ఒక షో ని ప్రసారం చేస్తున్నారు. ఈ షో ఒక కొత్త ప్రయత్నం అని చెప్పవచ్చు. మొదట ఈ షో తమిళ్ లో స్టార్ విజయ్ టీవీ వారు మొదలు పెట్టారు. అక్కడ సూపర్ హిట్ అయ్యాక ఇప్పుడు స్టార్ మా వారు తెలుగులో చేశారు.
ఈ ‘కుకు విత్ జాతిరత్నాలు’ కార్యక్రమం వంటలకు సంబందించిన కార్యక్రమం కాదు. అయితే ఈ షో లో వంటలు చేస్తారు. ఇది కామెడీ షో కాదు కానీ కామెడీ వండుతారు. ఇది రియాలిటీ షో కాదు, కానీ రియాలిటీ షో లో ఉండే అంశాలు ఉంటాయి. ఇది గేమ్ షో కాదు, కానీ గేమ్ షో కు సంబందించిన అంశాలు ఉంటాయి.
అయితే ఈ షో కు ప్రదీప్ యాంకర్. న్యాయ నిర్ణేతలుగా సినీ నటి రాధా, చెఫ్ సంజయ్, సినీ నటుడు ఆశిష్ విద్యార్థి వ్యవహరిస్తున్నారు
ఇక ఈ ‘కుకు విత్ జాతిరత్నాలు’ కార్యక్రమంలో శనివారం నాడు 5 గురు కుక్ లు, వాళ్ళతో పాటు 5 గురు జాతి రత్నాలు ఉంటారు. అలాగే ఆదివారం నాడు 5 గురు కుక్ లు, వాళ్ళతో పాటు 5 గురు జాతి రత్నాలు ఉంటారు. ఒక కుక్, ఒక జాతి రత్నం ఒక టీం. మొత్తం 10 టీం లు, మొత్తంగా ఈ షో లో 20 మంది ఉంటారు. ఈ షో లో ఎలిమినేషన్ ప్రక్రియ కూడా ఉంటుంది.
మధ్య మధ్యలో కొత్త సినిమా హీరోయిన్లు, నిర్మాతలు, దర్శకులు ఆలా వచ్చి ఆలా వెళుతూ ఉంటారు. అయితే నిన్నటి ఎపిసోడ్ లో (జులై 19) లో యాదం రాజు, వేరే ఒక అమ్మాయితో జతగా వచ్చారు. వీరిద్దరి సంగీత్ కార్యక్రమం అని పెట్టారు.
అయితే ‘కుకు విత్ జాతిరత్నాలు’ కార్యక్రమం డిజైన్ చేసిన విధానం బాగుంది. ఇది ఒక సరికొత్త ఆలోచన. అయితే షో అంతా గందరగోళం గా తయారయింది. ఇందులో చేసే వంటలు వాళ్ళు ఎలా తయారు చేస్తారు అనేది మనకు చూపించరు. కావున ఈ షో వంటల కార్యక్రమానికి సంబందించినది కాదు. ఈ షో అంతా, ఈటీవీ జబర్దస్త్, శ్రీ దేవి డ్రామా కంపెనీ ల ను కలిపి చూసినట్టుంది. కామెడీ ని వండుతున్నారు. కామెడీ తప్ప ఏమి లేదు. 20 మంది కంటెస్టెంట్స్, ముగ్గురు జడ్జి లు, ఒక యాంకర్, మధ్య లో వచ్చిపోయే వాళ్ళతో గందరగోళం గా ఉంది. అయితే ఈ షో, కామెడీ ప్రధానం గా సాగే షో గా ఉంది. ఒకరోజు ఈ షో చూడకపోయినా పర్వాలేదు. బార్క్ రేటింగ్ లు కూడా ఈ షో కు అంత గొప్పగా లేనట్లు తెలుస్తోంది
‘కుకు విత్ జాతిరత్నాలు’ కార్యక్రమం, అక్కడక్కడా వేష ధారణలో, హాస్యం లో శృతి మించుతున్నట్లుగా కనపడుతోంది.
ఇంతమంది ని తీసుకు వచ్చారంటే చాలా ఖర్చు పెట్టి ఉంటారు. ఒక కొత్త కార్యక్రమం కోసం, స్టార్ మా వారు పడ్డ తపన అభినందనీయం. అలాగే ఈ కార్యక్రమాన్ని గందరగోళంగా చేసినందుకు విచారం.
స్టార్ మా వారు, ఎలాగో సెప్టెంబర్ మొదటివారం లో బిగ్ బాస్ లాంచ్ చేస్తారు. అప్పటిదాకా ఈ ‘కుకు విత్ జాతిరత్నాలు’ టైం పాస్ డిష్.

