ఆర్మాక్స్ సంస్థ వారు, ప్రతి నెలా , టాప్ టెన్ మోస్ట్ పాపులర్ మేల్ మరియు ఫిమేల్ స్టార్స్ జాబితాను విడుదల చేస్తుంది. జూన్ 2025 జాబితాలో ప్రభాస్ (Prabhas) నెంబర్ వన్ స్థానంలో ఉండగా, తమిళ్ స్టార్ హీరో విజయ్ రెండవ స్థానంలో, అల్లు అర్జున్ (Allu Arjun) 3వ స్థానంలో ఉన్నారు. బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ నాలుగవ స్థానంలో ఉండగా ఇంటివలే గుడ్ బాడ్ అగ్లీ తో మన ముందుకు వచ్చిన అజిత్ 5వ స్థానంలో ఉన్నారు
ఇక, ఆరు, ఏడు, ఎనిమిది స్థానాలలో తెలుగు స్టార్స్ మహేష్ బాబు(Mahesh Babu), తారక్ (NTR), రామ్ చరణ్ (Ram Charan)ఉన్నారు. తొమ్మిదవ స్థానంలో అక్షయ్కుమార్ ఉండగా, ఈ సారి 10 వ స్థానంలో నాచురల్ స్టార్ నాని ఉన్నారు. ఈ జాబితాలో మొదటి సారి నాని స్థానం సంపాదించి, దిగ్గజాల సరసన నిలిచారు.
ప్రభాస్ నెంబర్ వన్ స్థానం అలాగే ఉంది. స్టార్స్ ఇండియా లవ్స్ జాబితాలో ఈ సారి టాప్ టెన్ లో ఆరుగురు తెలుగు స్టార్స్ కాగా, ఇద్దరు తమిళ్ , ఇద్దరు హిందీ స్టార్స్ ఉన్నారు
ఫిమేల్ స్టార్స్ జాబితా లో సమంత (Samantha) మొదటి స్థానంలో ఉండగా, అలియా భట్, దీపికా పడుకొనే రెండు, మూడు స్థానాలలో ఉన్నారు. త్రిష నాలుగవ స్థానంలో ఉంది. కన్నప్ప లో పార్వతిగా నటించిన కాజల్ అగర్వాల్ ఐదవ స్థానంలో ఉండగా, రామాయణంలో సీత గా నటిస్తోన్న సాయి పల్లవి (Sai Pallavi) ఆరవ స్థానంలో ఉంది. ఆ తరవాతి స్థానాలలో నయనతార, రష్మిక మందాన, కీర్తి సురేష్, తమన్నా లు ఉన్నారు
అలియా భట్, దీపికా పాడుకొనే తప్ప మిగతా ఎనిమిది మంది దక్షిణాది తారలు కావడం విశేషం

