ఇప్పటిదాకా సీరియల్స్, సినిమాల రూపం లో రామాయణాన్ని చాల మంది తీశారు. అయితే 1987-88 లో దూర దర్శన్ లో వచ్చిన, రామానంద సాగర్ తీసిన రామాయణం ఎంత పెద్ద హిట్ అయ్యిందో మనందరికీ తెలిసిందే. కరోనా సమయంలో రామాయణం సీరియల్ ని మళ్ళీ ప్రసారం చేశారు. అప్పుడు కూడా సూపర్ హిట్ అయ్యింది. దూర దర్శన్ లో ప్రసారమయిన ఈ రామాయణం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది. రాముడిగా అరుణ్ గోవిల్, సీత గా దీపికా చికిలియా, హనుమంతుడిగా దారా సింగ్ నటించారు
తెలుగు లో బాపు సంపూర్ణ రామాయణం, గుణ శేఖర్ బాల రామాయణం, ఈ మధ్యనే ఓం రౌత్ ఆది పురుష్ తీశారు
1993 లో ది లెజెండ్ అఫ్ ప్రిన్స్ రామ అని రామాయణాన్ని యానిమేషన్ రూపం లో భారతీయుల, జపనీయులు కలయికలో వచ్చింది. ఇది కూడా సూపర్ హిట్ అయ్యింది. 2005 లో కూడా ఒక అనిమేషన్ చిత్రం హనుమాన్ వచ్చింది. దీనిలో కూడా రామాయణాన్ని టచ్ చేశారు
అయితే రామాయణం ఆధారంగా కొన్ని సోషల్ మూవీస్ వచ్చాయి. మణిరత్నం తీసిన రావణ్, రాజమౌళి తీసిన బాహుబలి, ఆర్ ఆర్ ఆర్ చిత్రాలు ఈ కోవలోకే వస్తాయి.
అయితే ఇప్పుడు రామాయణం టాపిక్ మళ్ళీ తెరమీదకు రావడానికి కారణం ప్రైమ్ ఫోకస్ అధినేత నమిత మల్హోత్రా. ఈ నమిత్ మల్హోత్రా ఎవరో కాదు. రణభీర్ కపూర్, అలియా భట్ నటించిన బ్రహ్మాస్త్ర – పార్ట్ 1 నిర్మించిన నిర్మాతల్లో ఒకరు
నమిత్ మల్హోత్రా రామాయణాన్ని రెండు భాగాలుగా తీస్తున్నారు. దీనికి మొత్తం 4000 కోట్ల బడ్జెట్ అని ప్రకటించారు. ఇప్పుడు ఇదే ఇండస్ట్రీ మొత్తం చర్చించుకుంటున్నారు.
ఈ రామాయణం లో రాముడిగా రణభీర్ కపూర్, సీత గా సాయి పల్లవి, రావణుడిగా కె జి ఎఫ్ స్టార్ యష్ నటిస్తున్నారు.
దంగల్, చిచోరే చిత్రాలకు దర్శకత్వం వహించిన నితీష్ తివారి ఈ రామాయణానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ రామాయణం మొదటి భాగం 2026 దీపావళి కి, రెండవ భాగం 2027 లో విడుదల చేయనున్నారు
ఇప్పటి దాకా అత్యధికంగా ఒక సినిమాకు 600-700 కోట్లు ఖర్చు పెట్టారు. కల్కి, ఆది పురుష చిత్రాల బడ్జెట్ సుమారు 600-700 కోట్ల మధ్యలో ఉంటుంది. రామాయణం బడ్జెట్ 4000 కోట్లు అందరు ముక్కున వేలేసుకుంటున్నారు. అగ్ర హీరోలు నటించడం, హాలీవుడ్ స్థాయి గ్రాఫిక్ వంటి వాటికి భారీ గా ఖర్చు పెడుతున్నారు.
రామాయణం కి దర్శకత్వం వహిస్తోన్న నితీష్ తివారి గతంలో తీసిన దంగల్ కు ప్రపంచ వ్యాప్తంగా 2000 కోట్ల కు పైగా వచ్చాయి. ఆ తరవాత బాహుబలి, పుష్ప చిత్రాలు సుమారు 1800 కోట్లు వసూలు చేశాయి.
భారతీయ చిత్రాలలో ఇప్పటిదాకా 2000 కోట్ల వసూళ్లు అత్యధికం. మరి ఇప్పుడు రామాయణం బడ్జెట్ 4000 కోట్లు అయితే, బ్రేక్ ఈవెన్ కావడానికి ఎంత వసూలు చేయాలి.
రామాయణం యూనివర్సల్ సబ్జెక్టు. కధ అందరికి తెలిసిందే. కొత్తగా ఏం చెప్పబోతున్నారు. సనాతన ధర్మం గురించి చెప్పబోతున్నారా. నాలుగు వేల కోట్లు ఖర్చు పెట్టి తీసిన సినిమా, బ్రేక్ ఈవెన్ కావాలంటే, హాలీవుడ్ సినిమాల రేంజ్ లో వసూలు రావాలి అంటే 0.5 బిలియన్ డాలర్ లు వసూలు చేయాలి. అది సాధ్యమయ్యే పనేనా. అధికార పార్టీ బీజేపీ ఈ సినిమాకు ఫండింగ్ చేస్తోందా….
అందరిని మెప్పించే రామాయణం తీయగలరా, విమర్శకుల నోటికి పని చెప్పకుండా తీయగలరా అన్న ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే 2026 దీపావళి కి మొదటి పార్ట్ చూస్తే తెలిసిపోతుంది

