విష్ణుకు కన్నప్ప కష్టాలు – భారీ నష్టాలు మిగిల్చిన కన్నప్ప

by | Jul 17, 2025 | సినిమా

మోహన్ బాబు నిర్మాతగా, మహాభారతానికి దర్శకత్వం వహించిన ముకేశ్ కుమార్ సింగ్ దర్శకుడిగా మంచు విష్ణు తన కలల ప్రాజెక్ట్ కన్నప్ప ని తెరకెక్కించాడు.

మంచు విష్ణుకు మొదటి పాన్ ఇండియా చిత్రం.  అక్కడికి ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్ లను తీసుకొచ్చి పాన్ ఇండియా చిత్రానికి కావలసిన హంగులన్నీ అద్దాడు

అయితే మంచు విష్ణు కలల ప్రాజెక్ట్ కన్నప్ప విడుదలైన మొదటి వారం వసూళ్లు బాగానే ఉన్న రెండవ వారానికి పూర్తిగా చతికిలపడింది. 

గ్రేట్ ఆంధ్ర, 123తెలుగు వంటి వెబ్ సైట్ లలో కన్నప్ప చిత్రానికి మంచి రేటింగ్ ఇచ్చారు.  చివరి అరగంట లో మంచు విష్ణు నటనకు కూడా ప్రశంసలు దక్కాయి. 

కన్నప్ప 20 రోజులకు గాను 32.9 కోట్ల నెట్ కలెక్షన్స్ ని సాదించినట్లుగా  సమాచారం. మొదటి వారం సుమారు 30 కోట్ల కలెక్షన్స్ సాధించిన కన్నప్ప తరవాతి 12 రోజులలో, కేవలం  2.9 కోట్ల వసూళ్లు మాత్రమే సాధించింది

మొదటి వారంలో  ఈ మాత్రం కలెక్షన్స్ వచ్చాయంటే ప్రభాస్ పుణ్యమే అని చెప్పుకోవచ్చు.   మంచు విష్ణు కన్నప్ప కి 200 కోట్ల రూపాయలు ఖర్చు అయ్యిందని చెప్పారు.  ఈ లెక్కన్న చూస్తే, కన్నప్ప అతి పెద్ద డిజాస్టర్ గా నిలిచింది.

కృష్ణం రాజు నటించిన  భక్త కన్నప్ప వచ్చిన 49 ఏళ్ళ తరవాత వచ్చిన ఈ కన్నప్ప సినిమాలో తిన్నడు, శివుడికి తన కళ్ళను ఇచ్చే సన్నివేశం తప్ప మిగతాది అంతా  కల్పితం అని తెలుస్తోంది.

అక్షయ్ కుమార్, కాజల్ లను శివ, పార్వతులుగా చూడలేకపోయారు.  ఏదో హిందీ వాళ్ళు తీసే సీరియల్ శివ పార్వతులుగా ఉన్నారు

మంచు ఫ్యామిలీ కి ఫ్యాన్ బేస్ అనేది లేదు.  అటువంటప్పుడు 200 కోట్లు ఖర్చు పెట్టి కన్నప్ప ఎందుకు తీశా రు.  అందునా కృష్ణంరాజు నటించిన క్లాసిక్ ‘భక్త కన్నప్ప’ ను ఎందుకు ముట్టుకున్నాడు.

.  కన్నప్ప హిందీ వెర్షన్ సాటిలైట్ రైట్స్ 20 కోట్ల భారీ ధరకు అమ్ముడైంది.  అమెజాన్ కూడా 20 కోట్ల వరకు ఇచ్చి ఉండవచ్చు.  అయితే ఇంకా కన్నప్ప శాటిలైట్ రైట్స్ మాత్రం అమ్ముడుపోలేదు.  కన్నప్ప చిత్రం  సుమారు 120 కోట్ల నష్టాలూ తెచ్చిందని తెలుస్తోంది.

సోషల్ మీడియా లో మీమ్స్ కు, ట్రోల్ కు గురవడంతో మంచు విష్ణు ముందుంటాడు.  ఆఖరికి కన్నప్ప సినిమా ని కూడా సోషల్ మీడియా వదలలేదు

ఓ టి టి లో , టెలివిజన్ లో వచ్చినా ఈ సినిమాని ప్రేక్షకులు ఆదరిస్తారా అనేది సందేహమే ఎంతలేదన్నా, మంచు విష్ణుకు కన్నప్ప నిరాశ మిగిల్చిందని చెప్పాలి.