గేమ్ చేంజర్ ట్రైలర్ ఈవెంట్ కు ముఖ్య అతిధిగా ఎస్ ఎస్ రాజమౌళి

by | Jan 1, 2025 | సినిమా

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరో గా దిల్ రాజు నిర్మిస్తోన్న 50 వ చిత్రం గేమ్ చేంజర్. దిగ్గజ దర్శకుడు శంకర్ దీనికి దర్శకత్వం వహిస్తున్నారు.  ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 10 విడుదల అవుతున్న విషయం మనందరికీ తెలిసిందే

ఆదివారం విజయవాడ లో జరిగిన 256 అడుగుల రామ్ చరణ్ కట్ అవుట్ లాంచ్ కార్యక్రమంలో పాల్గొన్న నిర్మాత దిల్ రాజు ట్రైలర్ జనవరి 1 న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు.  అయితే ఈ రోజు విడుదల కావలసిన ట్రైలర్ రేపు విడుదలవుతోంది అని మేకర్స్ ప్రకటించారు.  ఈ ట్రైలర్ విడుదల కార్యక్రమానికి ఎస్ ఎస్ రాజమౌళి ముఖ్య అతిధిగా రాబోతున్నారు.  జనవరి 2 న, ఈ ట్రైలర్ ను సాయంత్రం 5 గంటల నాలుగు నిముషాలకు రాజమౌళి చేతుల మీదుగా విడుదల చేయనున్నారు

గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆంధ్ర ప్రదేశ్ లో జనవరి 4 న జరపడానికి నిర్మాత దిల్ రాజు సన్నాహాలు చేస్తున్నారు.  ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ గారు ముఖ్య అతిధిగా వస్తున్నారని మనందరికీ తెలిసిందే.