సంధ్య థియేటర్ ఘటన  – డి జి  పి, హైదరాబాద్ సీపీ కి NHRC నోటిసులు

by | Jan 2, 2025 | వార్తలు

సంధ్య థియేటర్ వద్ద  జరిగిన తొక్కిసలాట జరిగిన రోజు ఎలాంటి యాక్షన్ తీసుకున్నారు అనే విషయమై ఒక నివేదిక ను సంపర్పించాలని నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్, డి జి  పి, హైదరాబాద్ సీపీ కి నోటీసులు పంపించింది.

ఈ తొక్కిసలాటలో రేవతి అనే మహిళా మృతి చెందిన విషయం తెలిసిందే.  రేవతి కుమారుడు ప్రస్తుతం శ్రీ తేజ్ కిమ్స్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న విషయం కూడా మనందరికీ తెలిసిందే.

ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే అల్లు అర్జున్ రెగ్యులర్ బెయిల్ కోసం అప్పీల్ చేసుకున్నాడు. ఈ కేసు ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.