2025 – పాన్ ఇండియా నామ సంవత్సరం

by | Jan 1, 2025 | సినిమా

2025 లో వరస పెట్టి పాన్ ఇండియా సినిమాలు రాబోతున్నాయి.  అవేంటో చూద్దాం.

Game Changer : రామ్ చరణ్ హీరోగా, శంకర్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మిస్తోన్న 50 వ చిత్రం గేమ్ చేంజర్.  ఈ సినిమా, జనవరి 10 న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది.  బడ్జెట్ 300 నుండి 350 కోట్ల దగా ఉండచ్చు

Daku Maharaj : బాల కృష్ణ హీరోగా బాబీ కొల్లి దర్శకత్వం వహిస్తోన్న డాకు మహారాజ్ కూడా సంక్రాంతి కి విడుదలవుతోంది.  దీనిని కూడా ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయడానికి ప్రయత్నిష్టున్నారు.  దీని బడ్జెట్ సుమారు 120 నుండి 175 కోట్లు

విశ్వంభర – మెగా స్టార్ చిరంజీవి హీరో గా రూపొందుతూనే ఫాంటసీ ఫిలిం విశ్వంభర.  ఈ సినిమా సుమారు 200 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతోంది.  ఈ సినిమాని మే 9 న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు నిర్మాతలు

కాంతారా ప్రీక్వెల్ – రిషబ్ శెట్టి హీరో గా నటించిన కాంతారా దేశ వ్యాప్తం గా ఎంత పెద్ద సంచలనమ్ సృష్టించిందో మనందరికీ తెలియందే.  2025 లో కాంతారా – 2(ప్రీక్వెల్) ను రిలీజ్ చేయడానికి హోంబలే ఫిలిమ్స్ వారు ప్రయత్నాలు చేస్తున్నారు.  దీని బడ్జెట్ కూడా సుమారు 200 కోట్లకు పైగా ఉండచ్చు

కూలి : రజనికాంత్ నటిస్తోన్న మరో పాన్ ఇండియా చిత్రం కూలీ. లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రం కూడా పాన్ ఇండియా స్థాయిలో రూపొందిస్తున్నారు

రాజా సాబ్ : ప్రభాస్, రాజా సాబ్ కూడా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.  ప్రభాస్ సినిమాలన్నీ పాన్ ఇండియా సినిమాలే

సికిందర్ : సల్మాన్ ఖాన్, మురుగదాస్ కాంబినేషన్ లో వస్తోన్న మరో పాన్ ఇండియా చిత్రం సికిందర్.  ఈ సినిమా బడ్జెట్ 400 కోట్ల దాక ఉండొచ్చు.  ఈ సినిమా ఈద్ పండగకు రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు

ఎమర్జెన్సీ : కంగనా నటించిన ఎమర్జెన్సీ కూడా పాన్ ఇండియా చిత్రమే. దీనిని కూడా 2025 లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు

వార్-2 : ఎన్టీఆర,  హ్రితిక్ రోషన్ కలిసి నటిస్తోన్న భారీ బడ్జెట్ చిత్రం వార్-2 కూడా 2025 లో విడుదల అవబోతోంది.  దీని బడ్జెట్ కూడా సుమరీ 500 కోట్లు ఉండచ్చు

హరి హర వీర మల్లు – పవన్ కళ్యాణ్ నటించిన హరి హర వీరమల్లు కూడా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతోంది

ఇవే కాకుండా నిఖిల్ నటిస్తోన్న స్వయంభూ, కమల్ హాసన్ నటిస్తోన్నతగ్ లైఫ్, అజిత్ నటిస్తోన్నగుడ్, బాడ్, అగ్లీ మరియు నాగ చైతన్య నటిస్తోన్న తండేల్ సినిమాలు కూడా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతున్నాయి.

అంతే కాదండోయ్ మంచు విష్ణు నటిస్తోన్న కన్నప్ప, తేజ సజ్జ నటిస్తోన్న మిరై, బాల కృష్ణ నటిస్తోన్న అఖండ-2, ప్రభాస్ నటిస్తోన్న సాలార్ 2, ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ సినిమాలు కూడా పాన్ ఇండియా సినిమాలుగా రూపుదిద్దుకుంటున్నవే.

ఇప్పుడే రాకపోయినా, మహేష్ బాబు, రాజ మౌళి కాంబినేషన్ లో వస్తోన్న ప్రపంచ స్థాయి సినిమా వీటన్నింటి కన్నా ముందు వరసలో ఉంది.

ఇక నుండి తెలుగు సినిమా, తమిళ్ సినిమా, కన్నడ సినిమా, మళయాలం సినిమా, హిందీ సినిమా అన్న బేధాలు ఉండవన్నమాట.  ఉన్నదల్లా ఒకటే, కేవలం భారతీయ సినిమా