గేమ్ చేంజర్ ట్రయిలర్ విడుదల తేదీ, టైం ఫిక్స్ చేసిన మేకర్స్

by | Jan 1, 2025 | సినిమా

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, కియారా అద్వానీ నటిస్తున్న గేమ్ చేంజర్  సినిమాని  దిల్ రాజు తన 50 వ సినిమాగా  నిర్మిస్తున్నారు.  ఈ సినిమాకు మావెరిక్ డైరెక్టర్ శంకర్ దర్సత్త్వం వహిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే.

గేమ్ చేంజర్  ట్రైలర్ ని మొదట గా జనవరి 1 న విడుదల చేస్తున్నామని దిల్ రాజు విజయవాడ లో రామ్ చరణ్ కట్ అవుట్ ఆవిష్కరణకు వచ్చిన సందర్భం గా చెప్పారు.  అయితే ఇప్పుడు గేమ్ చేంజర్  ట్రైలర్ ఈ రోజు విడుదల చేయడం లేదని తెలుస్తోంది.   గేమ్ చేంజర్ ట్రైలర్ ను రేపు అనగా జనవరి 2 న, సాయంత్రం ఐదు గంటల నాలుగు నిమిషాలకు విడుదల చేస్తున్నట్లుగా మేకర్స్ ప్రకటించారు.  గేమ్ చేంజర్  ట్రైలర్ కోసం అభిమానులు ఇంకో 36 గంటలు వేచి చూడక తప్పదు