తెలుగు సినిమా ప్రోగ్రెస్ రిపోర్ట్ 2024

by | Jan 1, 2025 | సినిమా

టాలీవుడ్ ప్రోగ్రెస్ రిపోర్ట్ 2024

2024 వ సంవత్సరం, తెలుగు సినిమా సంవత్సరంగా చెప్పవచ్చు. 

January

సంక్రాంతి కి నాలుగు పెద్ద సినిమాలు విడుదలై 2024 ను తెలుగు సినిమా ఘనంగా ఆరంభించింది.   వీటిలో చిన్న సినిమా గా విడుదలైన హనుమాన్ సంచలన విజయం సాధించింది.  ఈ సినిమాతో హీరో గా తేజ సజ్జ, దర్శకుడి గా ప్రశాంత్ వర్మ  పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు పొందారు.

వీటిలో చిన్న సినిమా గా విడుదలైన హనుమాన్ సంచలన విజయం సాధించింది.  ఈ సినిమాతో హీరో గా తేజ సజ్జ, దర్శకుడి గా ప్రశాంత్ వర్మ  పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు పొందారు. హనుమాన్ 300 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది.   సంక్రాంతికి వచ్చిన మరో సినిమా గుంటూరు కారం.  మహేష్ బాబు ని మాస్ హీరో గా చూపించిన సినిమా.  మొదటి సారిగా మహేష్ బాబు డాన్స్ అదరకొట్టేసాడు. అయితే త్రివిక్రమ్ కంటెంట్ లో దమ్ము లేకపోవడంతో సంక్రాంతి పండగ కలెక్షన్స్ తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.  వెంకటేష్ నటించిన 75 వ సినిమా Saindhav ప్రేక్షకులను ఏ మాత్రం ఆకట్టుకోలేకపోయింది.  నాగార్జున నా సామి రంగ పరవాలేదనిపించింది

February

సందీప్ కిషన్, వర్ష బొల్లమ్మ నటించిన ఊరు పేరు భైరవ కోన మంచి విజయాన్ని సాధించింది

March

మార్చ్ లో విడుదలైన విశ్వక్ సేన్ గామి , శ్రీ విష్ణు ఓం భీం బుష్ సినిమాలు విడుదలై పరవాలేదనిపించాయి. జొన్నలగడ్డ సిద్దు నటించిన టిల్లు స్క్వేర్ బాక్స్ ఆఫీస్ వద్ద ఘన విజయాన్ని సాధించింది.  ఈ  టిల్లు స్క్వేర్ సినిమా 100 కోట్ల మార్క్ గ్రాస్ కలెక్షన్స్ అందుకుంది. 

April

ఈ నెలలో విజయ దేవర కొండ ఫామిలీ స్టార్, గీతాంజలి మల్లి వచ్చింది, శ్రీరంగ నీతులు వంటి సినిమాలు విడుదలైన ఒక సినిమా కూడా విజయవంతం కాలేదు

June

జనవరి లో సంక్రాంతి సినిమాల తరవాత, మరి ముఖ్యం గా హనుమాన్ తరవాత బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్స్ వర్షం కురిపించిన సినిమా కల్కి. ప్రభాస్ హీరో గా నటించిన ఈ సినిమాకి నాగ్ అశ్విన్ దర్శకుడు. ప్రపంచ వ్యాప్తం గా కల్కి 1200 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది.  ప్రభాస్ సినిమా ఎలా ఉన్న 600 కోట్ల కలెక్షన్స్ గారంటీ.  ఈ నెలలో చాలా సినిమాలు వచ్చినప్పటికీ కల్కి మాత్రమే విజయం సాధించింది

August

ఈ నెలలో రవితేజ ‘మిస్టర్ బచ్చన్,’ రామ్ ‘డబుల్ ఇస్మార్ట్’, నాని సరిపోదా శనివారం చిత్రాలు సందడి చేశాయి. అయితే మిస్టర్ బచ్చన్ ¸ డబుల్ ఇస్మార్ట్’ సినిమాలు ఘోర పరాజయాన్ని మూట కట్టుకోగా, నాని సరిపోదా శనివారం సూపర్ హిట్ అయ్యి, నాని కెరీర్ లో మరో 100 కోట్ల సినిమాగా నిలిచింది.  ఇదే నెలలో విడుదలైన కొణిదెల నిహారిక తీసిన కమిటీ కుర్రాళ్లు సినిమాతో పాటు ఆయ్ సినిమాలు చిన్న చిత్రాలుగా విడుదలై మంచి విజయాన్ని సాధించాయి

September

ఈ నెలలో నివేద థామస్ నటించిన 35 – చిన్న కధ కాదు,  శ్రీ సింహ మత్తు వదలరా-2 చిత్రాలు ప్రేక్షకాదరణ పొందాయి.  సెప్టెంబర్ నెలాఖరున ప్రపంచ వ్యాప్తం గా విడుదలైన ఎన్టీఆర్, కొరటాల శివ ల దేవర 500 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది.  అయితే దేవర తారక్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ అయినప్పటికీ కంటెంట్ అంతగా గొప్పగా లేకపోవడం తో తారక్ ఇమేజ్ కు ఈ సినిమా ఏమి ఉపయోగపడలేదు

October

ఇక అక్టోబర్ లో, దీపావళి కి విడుదలైన చిన్న సినిమాలు అన్ని ఘన విజయాన్ని సాధించాయి.  కిరణ్ సబ్బవరం ‘క’ తో తన కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ ని అందుకున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా 50 కోట్ల కలెక్షన్స్ ను రాబట్టింది.  దుల్కర్ సల్మాన్ నటించిన  ‘లక్కీ భాస్కర్’ బ్యాంకింగ్ నేపథ్యంలో ఒక విన్నూత్న కధ, కథనాలతో విడుదలై సంచలన విజయాన్ని సాధించింది. ఈ సినిమా 110 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. వీటితో పాటు శివ కార్తికేయన్ అమరన్ కూడా తెలుగులో మంచి విజయాన్ని సాధించింది

December

డిసెంబర్ మొదటి వారం లో విడుదలైన పుష్ప-2, కంటెంట్ ఏమంత గొప్పగా లేకపోయినా, అత్యధిక (1200) స్క్రీన్ లలో సినిమా విడుదల అవడం, టికెట్ రేట్లు భారీగా పెంచడం, ప్రపంచ వ్యాప్తం పోటీగా వేరే ఏ సినిమాలు లేక పోవడం, పుష్ప-1 క్రేజ్ వంటి అంశాలు పుష్ప-2 అఖండ విజయాన్ని సాధించేలా చేశాయి.  ఇప్పటిదాకా పుష్ప 2 1700 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని సాధించిందని మేకర్స్ చెపుతున్నారు.  అయితే ఈ సినిమా చేసిన రచ్చ అంత ఇంత కాదు.   ఎన్నో రకాలుగా విమర్శలు ఎదుర్కొంది.  అల్లు అర్జున్ ఒక రాత్రి జైలులో ఉండొచ్చాడు.  అన్ని ఉన్న అంగట్లో శని అంటే ఇదేనేమో.  సినిమా బ్లాక్ బస్టర్ అయినా , కలెక్షన్స్ గురించి తప్ప ఈ సినిమా విజయం గురించి చెప్పుకోలేని పరిస్థితి.

మొత్తం గా సుమారు 250 కి పైగా తెలుగు సినిమాలు 2024 లో విడుదల అయ్యాయి.  వీటిలో హనుమాన్, కల్కి, దేవర, పుష్ప-2 సినిమాలు ఘనా విజయాన్ని సాధించాయి.  అయితే కధ పరంగా చూస్తే ఈ నాలుగు సినిమాలు కూడా వీక్ గానే ఉన్నాయి.  అయితే స్టార్ట్ పవర్, సినిమాల పట్ల రిలీజ్ కు ముందుం నుండి ఉన్న క్రేజ్ ఈ సినిమాల కలెక్షన్స్ కు దోహద పడ్డాయి.

స్టార్ పవర్ లేకుండా, కంటెంట్ తో హిట్ అయ్యిన సినిమాలు మాత్రం లక్కీ భాస్కర్, క, అమరన్ సినిమాలు మాత్రమే.

తెలుగు సినిమా బలం, బలహీనత తెలుగు సినిమా లవర్స్, ప్రేక్షకులే.