వైట్ వాష్ తప్పదా ? 2nd టెస్ట్ లోడ్రా కోసం పోరాడేవాళ్లు ఎవరు ?

by | Nov 25, 2025 | వార్తలు

India Vs SA Test Series : డ్రా కోసం పోరాడేవాళ్లు ఎవరు ? వైట్ వాష్ తప్పదా ?

భారత, సౌత్ ఆఫ్రికా జట్ల మధ్య గౌహతి లో జరుతోన్న రెండవ టెస్ట్ మ్యాచ్ లో భారత జట్టు పీకలలోతు కష్టాల్లో ఉంది.  టెస్ట్ సిరీస్ సౌత్ ఆఫ్రికా కు కోల్పోయినట్లే. అయితే వైట్ వాష్ తప్పదా లేదా తప్పించుకోగలరా అనే సందేహం సగటు క్రికెట్ అభిమానుల మదిని తొలిచేస్తోంది.

మొదటి టెస్ట్ మ్యాచ్ అనూహ్యంగా ఓడిపోయిన భారత జట్టు రెండవ టెస్ట్ లో అయినా గెలిచి సిరీస్ సమం చేస్తుంది అనుకొనుట, భారత జట్టు  రెండవ టెస్ట్ లో కూడా తడపడుతోంది

ఈ రోజు సౌత్ ఆఫ్రికా రెండవ ఇన్నింగ్స్ ను 5 వికెట్ల నష్టానికి 260 పరుగుల వద్ద డిక్లేర్ చేసి, భారత జట్టు 549 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది.

సౌత్ ఆఫ్రికా పక్క ప్రణాళిక ప్రకారం ఆడింది. కొండంత లక్ష్యాన్ని భారత జట్టు ముందుంచి, భారత జట్టు కు రెండవ ఇన్నింగ్స్ లో 16 ఓవర్లు ఆడే అవకాశం ఇచ్చింది.  ఒకటి లేదా రెండు వికెట్లు తీసి భారత జట్టును ఒత్తిడిలోకి నెట్టవచ్చు అన్న తన పాచిక పారింది.  భారత జట్టు రెండవ ఇన్నింగ్స్ లో 21 పరుగులకే ఓపెనర్ల వికెట్లు కోల్పోయింది

ఐదవ రోజు సుమారు 90 వర్ల ఆట మిగిలి ఉంది. ఈ టెస్ట్ గెలిచి సిరీస్ ను వైట్ వాష్ చేయడానికి  సౌత్ ఆఫ్రికాకు 8 వికెట్లు కావాలి.   భారత జట్టు పరువు నిలుపుకోవాలనుంటే ఈ టెస్ట్ మ్యాచ్ ను కనీసం డ్రా చేయగలగాలి.

అయితే ఐదవరోజు ఆట జడేజా, వాషింగ్టన్ సుందర్, రిషబ్ పంత్ ల మీదే ఉంది.  ఈ ముగ్గురు గోడలా నిలబడితే భారత జట్టు ను ఓటమి ప్రమాదంనుండి తప్పించవచ్చు.  అయితే ప్రస్తుత పరిస్థితులలో దాదాపు అసాధ్యం.  అయితే అనిశ్చితికి మారు పేరైన క్రికెట్ లో ఎప్పుడు, ఏమైనా జరగవచ్చు

భారత జట్టు రెండు ఇన్నింగ్స్ లో కలిపి నాలుగవ రోజు ఆట ముగిసే సమయానికి 12 వికెట్లు నష్టపోయి 228 పరుగులు మాత్రమే చేసింది.  భారత జట్టు తడబడిన ఇదే పిచ్ పై సౌత్ ఆఫ్రికా 15 వికెట్ల నష్టానికి 749 పరుగులు చేసి ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేసింది.

సౌత్ ఆఫ్రికా తరపున ఒక సెంచరీ, రెండు అర్ధ సెంచరీలు (90+ పరుగులు), ముగ్గురు ఆటగాళ్లు 45+ పరుగులు చేశారు.   భారత జట్టు ఇన్నింగ్స్ లో ఒకే ఒక్క అర్ధ సెంచరీ నమోదయింది

భారత జట్టు మొదటి ఇన్నింగ్స్ లో ఎక్కువ బంతులు ఆడింది కుల్దీప్ యాదవ్. 134 బంతులు ఆడిన కుల్దీప్ 19 పరుగులు చేసి వికెట్ల పతనాన్నికొద్దిసేపు  అడ్డుకున్నాడు

భారత జట్టును బౌలర్ లు సౌత్ ఆఫ్రికా వికెట్ లు తీయడానికి ఆపసోపాలు పడ్డారు. భారత స్టార్ పేసర్ బుమ్రా తేలిపోయాడు.  రెండు ఇన్నింగ్స్ లో కలిపి కేవలం రెండు వికెట్లు తీశాడు.  మొదటి ఇన్నింగ్స్ లో 4 వికెట్లు తీసిన కుల్దీప్ యాదవ్ కు రెండవ ఇన్నింగ్స్ లో ఒక్క వికెట్ కూడా లభించలేదు. రెండు ఇన్నింగ్స్ లో కలిపి జడేజా 6 వికెట్ లు తీశాడు.  బౌలింగ్ అల్ రౌండర్ గా పేరును తెచ్చుకున్న సుందర్ రెండు ఇన్నింగ్స్ లో కలిపి కేవలం ఒక్క వికెట్ మాత్రమే దక్కించుకున్నాడు.

ఇదే పిచ్ పై, ఇప్పటిదాకా, సౌత్ ఆఫ్రికా పేసర్ జాన్సెన్ 7 వికెట్ లు తీయగా, స్పిన్నర్ హార్మర్ 4 వికెట్లు తీశాడు

సమిష్టిగా ఆడితే మ్యాచ్ ను డ్రా చేసుకోవచ్చు.  ఎవరో ఒకరు భారీ ఇన్నింగ్స్ ఆడాలి అంటే చివరి దాకా నిలబడి సెంచరీ చేయాలి.  సాయి సుదర్శన్, వాషింగ్టన్ సుందర్, ధృవ్ జురెల్, నితీష్ కుమార్ రెడ్డి  లకు ఈ మ్యాచ్ చక్కని అవకాశం