2026 లో జరగబోయే టి 20 వరల్డ్ కప్ షెడ్యూల్ ను ఐసీసీ ప్రకటించింది. ఫిబ్రవరి 7 నుండి మార్చ్ 8 వరకు వరల్డ్ కప్ జరుగుతుంది. మార్చ్ 8 న అహ్మదాబాద్ లో ఫైనల్ మ్యాచ్ జరగనుంది. భారత, శ్రీలంక లు ఈ ప్రపంచ కప్ కు ఆతిధ్యమిస్తున్నాయి.
దాయాది దేశమైన పాకిస్థాన్ కూడా భారత జట్టు ఉన్న గ్రూప్ లోనే ఉంది. భారత, పాకిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ ఫిబ్రవరి 16 న కొలంబో లో జరగనుంది.
ఈ సారి 2026 టి 20 వరల్డ్ కప్ లో ఏకంగా 20 దేశాలు పాల్గొంటున్నాయి. ఇటలీ మొదటి సారిగా ఈ టి 20 వరల్డ్ కప్ లో ఆడబోతోంది. 20 జట్లను, నాలుగు గ్రూప్ లు గా విభజించారు. ప్రతి గ్రూప్ నుండి రెండేసి జట్లు సూపర్ 8 కి అర్హత సాధిస్తాయి. సూపర్ 8 వచ్చిన జట్లను మళ్ళీ రెండు గ్రూప్ లు గా విభజిస్తారు. ఈ రెండు గ్రూప్ ల నుండి మొదటి రెండు స్థానాలలో ఉన్న జట్లు సెమీ ఫైనల్ కు అర్హత సాధిస్తాయి. సెమీ ఫైనల్ లో గెలిచిన జట్లు ఫైనల్ కు చేరుకుంటాయి
హిట్ మాన్ రోహిత్ శర్మ ను 2026 టి 20 వరల్డ్ కప్ బ్రాండ్ అంబాసిడర్ గా నియమించారు. పూర్తి షెడ్యూల్ మీ కోసం.


