India Vs South Africa Test Series : భారత, సౌత్ ఆఫ్రికా జట్ల మధ్య గౌహతి లో జరిగిన రెండవ టెస్ట్ లో భారత జట్టు 408 పరుగుల తేడాతో ఘోర పరాయజయాన్ని చవిచూసింది. భారత జట్టు క్రికెట్ చరిత్రలో పరుగుల తేడా పరంగా (408 పరుగులు) ఇదే అతి ఘోర పరాజయం
భారత జట్టు కోచ్ లలో గ్యారీ కిర్ స్టెన్ ఒక్కడే భారత జట్టు కు ధోని నాయకత్వంలో అద్భుత విజయాలు సాధించి పెట్టాడు. చాపెల్, ద్రావిడ్, రవి శాస్త్రి, కుంబ్లే లు కోచ్ గా ఉన్నప్పుడు కొన్ని విజయాలు సాధించినా గ్యారీ కిర్ స్టెన్ స్థాయిలో ఎవరు సాధించలేదు.
కోచ్ గా చాపెల్, ద్రావిడ్, రవి శాస్త్రి, కుంబ్లే లు అద్భుతాలు చేయలేదు. కోచ్ గా గంభీర్ ఉన్నప్పుడు ఆసియా కప్, ఛాంపియన్స్ ట్రోఫీ లు గెలిచారు. అంతే కాకుండా ఇంగ్లాండ్ గడ్డపై సిరీస్ సమం చేశారు. చిన్న దేశాలైన బాంగ్లాదేశ్, వెస్ట్ ఇండీస్ ల పై టెస్ట్ సిరీస్ విజయాలు సాధించింది.
గంభీర్ కోచ్ గా ఉన్నప్పుడు సొంత గడ్డపై రెండు టెస్ట్ సిరీస్ లు వైట్ వాష్ అయ్యాయి. న్యూజిలాండ్ చేతిలో 3-0, సౌత్ ఆఫ్రికా చేతిలో 2-0 తో ఘోరంగా ఓడిపోయింది. అంత మాత్రానికే గంభీర్ ఒక్కడినే బాద్యుడిని చేయడం ఎంతవరకు సబబు. సోషల్ మీడియా లో గౌతమ్ గంభీర్ పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
న్యూజిలాండ్ చేతిలో భారత జట్టు 3-0 ఓడిపోయినప్పుడు అప్పటి భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ. సౌత్ ఆఫ్రికా చేతిలో ఓడిపోయినప్పుడు, శుభ్ మన్ గిల్ గాయంతో సిరీస్ నుండి తప్పుకోవడం వలన రిషబ్ పంత్ పగ్గాలు చేపట్టాల్సింది
అనుభవజ్ఞుడైన రోహిత్ శర్మ నాయకత్వంలోనే భారత న్యూజిలాండ్ చేతిలో 3-0 తో ఘోర పరాజయం పాలైనప్పుడు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ టైటిల్ గెలుచుకున్న సౌత్ ఆఫ్రికా చేతిలో యువకులతో నిండిన భారత జట్టు ఓడిపోవడంలో ఆశ్చర్యం లేదు
అయితే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, అశ్విన్ లు రిటైర్ అవడానికి గౌతమ్ గంభీర్ భాద్యుడా అనేది గంభీర్ కి, బీసీసీఐకి మాత్రమే తెలియాలి. డ్రెస్సింగ్ రూమ్ లో వాతావరణం ఎలా ఉంది, ఆటగాళ్లందరూ గంభీర్ తో కలవగలుగుతున్నారా అనే విషయం కూడా గంభీర్ కి, బీసీసీఐ కి తెలియాలి
కోచ్ పాత్ర ఎంత ఉన్నా, గ్రౌండ్ లో అడుగు పెట్టి ఆడే 11 మంది ఆటగాళ్ల ని బట్టి గెలుపు, ఓటములు ఉంటాయి. కోచ్ తో పాటు భారత జట్టు ఘోర పరాజయానికి 11 మంది ఆటగాళ్లు బాధ్యత తీసుకోవాలి.
భారత జట్టు పిచ్ ల పై సౌత్ ఆఫ్రికా స్పిన్నర్ హార్మర్ 17 వికెట్లు తీసి ప్లేయర్ అఫ్ ది సిరీస్ గెలుచుకున్నాడు. అతనితో పాటు సౌత్ ఆఫ్రికా పేసర్ జాన్సెన్ 12 వికెట్ లు తీసుకున్నాడు. ఈ సిరీస్ లో అత్యధిక వికెట్లు తీసుకున్న బౌలర్ల జాబితాలో మొదటి రెండు స్థానాలలో సౌత్ ఆఫ్రికా బౌలర్లు ఉన్నారు.
ఈ సిరీస్ లో జడేజా బౌలింగ్ ఒక్కటే కాస్త భారత జట్టు పరువు నిలిపింది. స్టార్ పేసర్ బుమ్రా ఈ సిరీస్ లో తీసుకుంది 8 వికెట్ లు. ఈ ఎనిమిది లో, 5 వికెట్ లు ఒక ఇన్నింగ్స్ లో తీసింది. మిగతా ఇన్నింగ్స్ లలో బుమ్రా ఘోరంగా విఫలమయ్యాడు. కుల్దీప్ యాదవ్ 8 వికెట్లు, సిరాజ్ 6 వికెట్ లు తీసుకున్నారు. సిరాజ్ ఘోర వైఫల్యం, కుల్దీప్ యాదవ్ బౌలింగ్ లో నిలకడలేని తనం వెరసి సొంత గడ్డపై భారత బౌలింగ్ వెల వెల బోయింది.
ఇక బ్యటింగ్ విషయానికి వస్తే అసలు మాట్లాడక్కర్లేదు. రెండు మ్యాచ్ ల ఈ టెస్ట్ సిరీస్ లో అత్యధిక పరుగులు చేసిన వారి జాబితాలో మొదటి 10 స్థానాలలో కేవలం ముగ్గురు భారతీయులు ఉన్నారు. వాషింగ్టన్ సుందర్ భారత జట్టు తరపున అత్యధికంగా 124 పరుగులు చేశాడు అంటే పరిస్థితి ఎలా ఉందొ అర్ధం చేసుకోవచ్చు. భారత జట్టు తరపున కేవలం రెండు అర్ధ సెంచరీ నమోదయ్యాయి. అందులో ఒకటి జైస్వాల్, రెండవది ఈ రోజున జడేజా చేసింది
సౌత్ ఆఫ్రికా బ్యాట్స్ మన్ సెంచరీ, అర్ధ సెంచరీ లు నమోదు చేసిన పిచ్ మీద భారత జట్టు బ్యాట్స్ మన్ బోర్లా పడ్డారు. సౌత్ ఆఫ్రికా స్పిన్నర్ హార్మర్, పేసర్ జాన్సెన్ లు విజృంభించిన ఇదే పిచ్ మీద భారత పేసర్ బుమ్రా, స్పిన్నర్ లు కుల్దీప్ యాదవ్, సుందర్ లు ఘోరంగా ఫెయిల్ అయ్యారు.
కారణాలు ఏమైనా, రోహిత్ శర్మ, కోహ్లీ లు రిటైర్ అవడంతో పాటు భారత జట్టులో టెస్ట్ సగటు 36 పరుగులు మాత్రమే ఉన్నా అవకాశాలు వెన్నంటి వస్తోంది కే ఎల్ రాహుల్ ఘోర వైఫల్యం, ధృవ్ జురెల్, సాయి సుదర్శన్ లు కొంత గ్యాప్ తరవాత టెస్ట్ మ్యాచ్ కు రావడం, అనుభవం లేకపోవడం, రిషబ్ పంత్ కూడా గాయం కారణంగా, చాలా కాలం విరామం తరవాత టెస్ట్ జట్టులోకి రావడం, నిలకడలేని జైస్వాల్ బ్యాటింగ్, బుమ్రా, సిరాజ్ ల బౌలింగ్, బ్యాటింగ్ మీద దృష్టి పెట్టి బౌలింగ్ లో వికెట్లు తీయలేకపోతోన్న సుందర్. ఇలా చెప్పుకుంటూ పోతే అనేక కారణాలు.
సౌత్ ఆఫ్రికా ఆటగాళ్లు స్వీప్ బాగా ఆడారు. భారత జట్టు ఆటగాళ్లు స్వీప్ ఆడలేకపోవడమే కాక స్పిన్ బౌలింగ్ ను అంచనా వేయడంలో ఘోరగాం విఫలమయ్యారు. స్పిన్నర్ లకు అనుకూలిస్తోన్న పిచ్ పై జాన్సెన్ యుక్తి తో 6 వికెట్లు దక్కించుకున్నాడు
ఆటగాళ్ల అనుభవలేమి ప్రధాన కారణం తో పాటు జట్టు కూర్పు కూడా ఒక కారణం. అందునా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ గెలిచిన సౌత్ ఆఫ్రికా వంటి జట్టు తో సిరీస్
కర్ణుడి చావుకు 100 కారణాలు అన్నట్లు భారత జట్టు ఘోర పరాజయానికి అనేక కారణాలు. ఈ పరాజయాలకు గంభీర్ ఒక్కడినే బాధ్యుడిని చేయలేము

