SLBC టన్నెల్ రెస్క్యూ ఆపరేషన్ లో 11 సంస్థలు – ఉత్తమ్ కుమార్

by | Mar 2, 2025 | వార్తలు

సంఘటన జరిగిన నాటి నుండి ఈ రోజు వరకు 8 మంది ప్రాణాలు కాపాడాడనికి రెస్క్యూ ఆపరేషన్ ని కొనసాగిస్తున్నాము. హైదరాబాద్ నుండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 2-3 గంటలకొకసారి దీని మీద మమ్మల్ని సంప్రదిస్తున్నారు

దురదృష్టవశాత్తు, ప్రపంచంలోనే అరుదైన టన్నెల్ ఆక్సిడెంట్ జరిగింది. ఇది చాలా బాధాకరం.  ఈ విషాదకర సంఘటన నుండి తేరుకుని టన్నెల్ లో చిక్కుకున్న వారి ప్రాణాలు కాపాడడానికి మా ప్రయత్నాలను కొనసాగిస్తున్నాం.  టన్నెల్ చివరలో సమస్యలు తలెత్తుతున్నాయి.

ఈ టన్నెల్ టెక్నాలజీ తెలిసినవాళ్ళు, అనుభవజ్ఞులైన వారందరూ ఇక్కడ ఉన్నారు.  ఇండియన్ ఆర్మీ, నేవీ మార్కోస్ , మెరైన్ కమాండోస్, బోర్డర్ రోడ్ ఆర్గనైజషన్, నేషనల్ హైవే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్, ఇండియన్ రైల్వేస్, యెన్ డి ఆర్ ఎఫ్, ఎస్ డి ఆర్ ఎఫ్, సింగరేణి కాలరీస్, యెన్ జి ఆర్ ఐ, సర్వే అఫ్ ఇండియా  వంటి 11 సంస్థలు దేశ, విదేశాల నుండి సమన్వయంతో పని చేస్తున్నాయి

ఎస్ ఎల్ బి సి ప్రాజెక్ట్ తెలంగాణ కోసం పూర్తిగా డిజైన్ చేయబడిన ప్రాజెక్ట్.  ఈ ప్రాజెక్ట్ వలన రూపాయ ఖర్చు లేకుండా, శ్రీశైలం కింద నుండి 30 టి ఎమ్ సి ల నీళ్లు గ్రావిటీ ద్వారా 3-4 లక్షల ఎకరాలకు నీళ్లు తీసుకు వచ్చే సొరంగ మార్గం. దీనికి సంబంధించిన పనులు 20 ఏళ్ళ నుండి జరుగుతున్నాయి.  ఇది తాత్కాలిక బ్రేక్ మాత్రమే. ఈ ప్రాజెక్ట్ ను పూర్తి చేస్తామని మనవి చేస్తున్నాను అని ఇరిగేషన్, ఫుడ్ అండ్ సివిల్ సప్లైస్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అన్నారు