మార్చ్ 4 న సెమిస్ లో భారత, ఆస్ట్రేలియా జట్ల మధ్య మ్యాచ్

by | Mar 2, 2025 | వార్తలు

ఛాంపియన్స్ ట్రోఫీ (Champions Trophy) లో భాగంగా జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్ లో భారత జట్టు న్యూజిలాండ్ పై  44 పరుగుల తేడాతో విజయం సాధించింది.

250 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన న్యూజిలాండ్ జట్టు 45.3 ఓవర్ల లో 205 పరుగులకు అల్ అవుట్ అయ్యింది.  భారత జట్టు, ఆస్ట్రేలియా తో మార్చ్ 4 న సెమి ఫైనల్ (Semi Final) లో తలపడుతుంది.  మార్చ్ 5 న, న్యూజిలాండ్, సౌత్ ఆఫ్రికా తో మరో సెమి ఫైనల్ లో తలపడుతుంది

250 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన న్యూజిలాండ్ క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోతూ వచ్చింది. విలియమ్సన్ ఒక్కడే గోడలా నిలబడి 120 బంతుల్లో 81 పరుగులు చేసి అవుట్ అయ్యాడు

మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి (Varun Chakravarthy) 5 వికెట్లతో న్యూజిలాండ్ పతనాన్ని శాసించాడు. కుల్దీప్ యాదవ్ రెండు వికెట్లు, హార్దిక పాండ్య, అక్షర్ పటేల్(Akshar Patel) , జడేజా (Jadeja) లు తలా ఒక వికెట్ తీశారు

అంతకు ముందు, టాస్ గెలిచిన న్యూజిలాండ్ ఫీల్డింగ్ ఎంచుకుంది. 

మొదట బ్యాటింగ్ చేసిన భారత జట్టు 9 వికెట్ల నష్టానికి 249 పరుగులు చేసింది.  భారత జట్టు మొదటి 3 వికెట్లను వెంట వెంటనే కోల్పోయింది.  ఓపెనర్ లు రోహిత్  శర్మ 15 పరుగులు, శుభ్ మన్  గిల్ 2 పరుగులు చేసి అవుట్ అయ్యారు. 300 వ వన్ డే ఆడుతోన్న విరాట్ కోహ్లీ 11 పరుగులు చేసి, ఫిలిప్స్ ఒంటి చేత్తో అందుకున్న అద్భుతమైన క్యాచ్ కు వెనుతిరగాల్సి వచ్చింది.

ఆ తరవాతవచ్చిన శ్రేయాస్ అయ్యర్(Shreyas Ayyar) , అక్షర్ పటేల్ (Akshar Patel) లు ఆచి తూచి ఆడుతూ స్కోర్ బోర్డు ను కదిలిస్తూ వచ్చారు.  వీరిద్దరూ నాలుగవ వికెట్ కు 98 పరుగులు జోడించారు.  42 పరుగులు చేసిన రచిన్ రవీంద్ర బౌలింగ్ లో అవుట్ అయ్యాడు

ఆ తరవాత వచ్చిన కె ఎల్ రాహుల్ తో జత కలిసిన శ్రేయాస్ అయ్యర్ 5 వ వికెట్ కు 44 పరుగులు జోడించాక మరోసారి భారత జట్టు తడబాటుకు గురైంది.  79 పరుగులు చేసిన శ్రేయాస్ అయ్యర్ 5 వ వికెట్ గా వెనుతిరిగాడు.  మరో వైపు, రాహుల్ 23 పరుగులు చేసి అవుట్ అయ్యాడు  

182 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన తరుణంలో, హార్దిక్ పాండ్య, రవీంద్ర జడేజా ఆరవ వికెట్ కు 41 పరుగులు జోడించి ఆదుకున్నారు. అయితే 16 పరుగులు చేసిన జడేజా, విలియమ్సన్ అద్భుతమైన క్యాచ్ కు వెనుతిరగాల్సి వచ్చింది

షమీ అండగా, హార్దిక్ పాండ్య చెలరేగిపోయాడు. హార్దిక పాండ్య 45 బంతుల్లో 45 పరుగులు చేసి హెన్రీ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు.  ఇందులో 2 సిక్సర్లు, 4 ఫోర్లు ఉన్నాయి

న్యూజిలాండ్ బౌలర్లలో హెన్రీ 5 వికెట్లు తీయగా, ఒరూర్కే, సాంట్నర్, జేమిసన్, రచిం రవీంద్ర తలా ఒక వికెట్ తీసుకున్నారు.