గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు (Buchiababu) దర్శకత్వంలో ‘ఆర్‌సీ16’ వర్కింగ్ టైటిల్ తో సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్ (Sukumar Writings) బ్యానర్లపై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. కాగా, కుస్తీతో పాటు క్రికెట్ బ్యాక్‌గ్రౌండ్‌లో ఎమోషనల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా రూపొందనుందని తెలుస్తోంది. అయితే, తాజాగా ‘ఆర్‌సీ16’ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ గా మారింది.
తాజా సమాచారం ప్రకారం ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోండగా.. ఇటీవలే మైసురులో ఓ కీలక షెడ్యూల్ పూర్తయింది. ఈ షెడ్యూల్ లో రామ్ చరణ్(Ram Charan( తో పాటుగా ఇతర తారాగణంపై కీలక సీన్స్ షూట్ చేశారు. ఈ మూవీ సెకండ్ షెడ్యూల్ మరికొన్ని రోజుల్లో ఢిల్లీలో ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ఈ షెడ్యూల్‌లో రామ్‌చరణ్ (Ram Charan) తో పాటు ఇతర ముఖ్య నటులపై కుస్తీ బ్యాగ్డ్రాప్ సీన్స్ షూట్ చేయనున్నట్లు సమాచారం. దీనితో పాటుగా ఢిల్లీలోని పార్లమెంట్‌లో (Parliament) మరిన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుడా జామా మసీదు ప్రాంతంలోనూ ముఖ్య సన్నివేశాలు చిత్రీకరించనున్నారని సమాచారం. ఈ షూటింగ్ కు సంబంధించిన అనుమతుల ప్రక్రియ ఇప్పటికే పూర్తయినట్లు తెలుస్తోంది. మార్చి 4న పార్లమెంట్‌లో ఈ మూవీ షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశమున్నట్లు సమాచారం.
ఇక ఢిల్లీ షెడ్యూల్ ముగిశాక దానికి కొనసాగింపుగా కొన్ని కీలక సన్నివేశాలను కాకినాడలో కూడా చిత్రీకరించనున్నారని సమాచారం. కాకినాడ సమీపంలో ఉప్పాడ బీచ్ దగ్గర ఈ సన్నివేశాలను షూట్ చేయనున్నట్లు సమాచారం. ఈ బీచ్ సీన్స్ ప్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో వస్తాయని తెలుస్తోంది. ఇదిలాఉంటే, మార్చి 27న రామ్‌చరణ్(Ram Charan) బర్త్ డే కానుకగా టైటిల్, టీజర్ రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా, ఈ చిత్రంలో బాలీవుడ్ భామ జాన్వీకపూర్ హీరోయిన్‌గా నటిస్తోండగా.. కన్నడ నటుడు శివ రాజ్ కుమార్ (Shiv Raj Kumar) కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాకి ఎఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తుండగా.. రత్నవేలు సినిమాటోగ్రాఫర్‌గా ఉన్నారు.

