రాణించిన శ్రేయాస్ అయ్యర్, అక్షర్ పటేల్, హార్దిక పాండ్య ; న్యూజిలాండ్ బౌలర్ హెన్రీ కు 5 వికెట్లు
ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా జరుగుతోన్న ఆఖరి లీగ్ మ్యాచ్ లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ ఫీల్డింగ్ ఎంచుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన భారత జట్టు 9 వికెట్ల నష్టానికి 249 పరుగులు చేసింది
బ్యాటింగ్ ప్రారంభించిన భారత జట్టు మొదటి 3 వికెట్లను వెంట వెంటనే కోల్పోయింది. ఓపెనర్ లు రోహిత్ శర్మ 15 పరుగులు, శుభ్ మన్ గిల్ 2 పరుగులు చేసి అవుట్ అయ్యారు. 300 వ వన్ డే ఆడుతోన్న విరాట్ కోహ్లీ 11 పరుగులు చేసి, ఫిలిప్స్ ఒంటి చేత్తో అందుకున్న అద్భుతమైన క్యాచ్ కు వెనుతిరగాల్సి వచ్చింది.
ఆ తరవాతవచ్చిన శ్రేయాస్ అయ్యర్, అక్షర్ పటేల్ లు ఆచి తూచి ఆడుతూ స్కోర్ బోర్డు ను కదిలిస్తూ వచ్చారు. వీరిద్దరూ నాలుగవ వికెట్ కు 98 పరుగులు జోడించారు. 42 పరుగులు చేసిన రచిన్ రవీంద్ర బౌలింగ్ లో అవుట్ అయ్యాడు
ఆ తరవాత వచ్చిన కె ఎల్ రాహుల్ తో జత కలిసిన శ్రేయాస్ అయ్యర్ 5 వ వికెట్ కు 44 పరుగులు జోడించాక మరోసారి భారత జట్టు తడబాటుకు గురైంది. 79 పరుగులు చేసిన శ్రేయాస్ అయ్యర్ 5 వ వికెట్ గా వెనుతిరిగాడు. మరో వైపు, రాహుల్ 23 పరుగులు చేసి అవుట్ అయ్యాడు
182 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన తరుణంలో, హార్దిక్ పాండ్య, రవీంద్ర జడేజా ఆరవ వికెట్ కు 41 పరుగులు జోడించి ఆదుకున్నారు. అయితే 16 పరుగులు చేసిన జడేజా, విలియమ్సన్ అద్భుతమైన క్యాచ్ కు వెనుతిరగాల్సి వచ్చింది
షమీ అండగా, హార్దిక్ పాండ్య చెలరేగిపోయాడు. హార్దిక పాండ్య 45 బంతుల్లో 45 పరుగులు చేసి హెన్రీ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. ఇందులో 2 సిక్సర్లు, 4 ఫోర్లు ఉన్నాయి
న్యూజిలాండ్ బౌలర్లలో హెన్రీ 5 వికెట్లు తీయగా, ఒరూర్కే, సాంట్నర్, జేమిసన్, రచిం రవీంద్ర తలా ఒక వికెట్ తీసుకున్నారు

