ఆసక్తికరంగా శివరాజ్ కుమార్, ఉపేంద్రల ’45’ టీజర్

by | Mar 31, 2025 | సినిమా

కరునాడ చక్రవర్తి, శివరాజ్ కుమార్, రియల్ హీరో ఉపేంద్ర లు నటిస్తోన్న చిత్రం ’45’.  ప్రముఖ సంగీత దర్శకుడు, గాయకుడు అయిన అర్జున్ జన్య మొదటి సారిగా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.  ఇంకా ఈ చిత్రంలో రాజ్ బి శెట్టి, జిష్షు సేన్ గుప్త, కౌస్తుభ మని తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రలలో నటిస్తున్నారు

సూరజ్ ప్రొడక్షన్స్ పై, రమేష్ రెడ్డి ఈ ’45’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆగష్టు 15 న విడుదల కాబోతున్న ఈ చిత్రం టీజర్ ను విడుదల చేశారు మేకర్స్

ఈ చిత్రానికి కధ, స్క్రీన్ ప్లే, సంగీతం, దర్శకత్వం అని తానై రూపొందించారు అర్జున్ జన్య.  ఈ టీజర్ లో  శివ రాజ్ కుమార్, ఉపేంద్ర ల  మధ్య సంభాషణలు ఆకట్టుకునేలా ఉన్నాయి. పాన్ ఇండియా చిత్రం గా విడుదలవుతున్న ఈ యాక్షన్ కామెడీ చిత్రం పై అంచనాలు భారీగానే ఉన్నాయి