‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’ నుండి నాయాల్ది’ పాట విడుదల

by | Mar 31, 2025 | సినిమా

టాలీవుడ్ సీనియర్ హీరో నందమూరి కళ్యాణ్ రామ్ కథానాయకుడిగా ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో  తెరకెక్కుతున్న చిత్రం ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’. 

ఈ చిత్రం ప్రొమోషన్స్ లో భాగంగా ‘నాయాల్ది’ పాట లిరికల్ వీడియో ని విడుదల చేశారు.  ఈ సినిమాకు అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందిస్తున్నారు

ఇంకా ఈ చిత్రంలో శ్రీకాంత్, సాయి మంజ్రేకర్, యానిమల్ ఫేమ్ పృథ్వీరాజ్ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. భారీ బడ్జెట్ తో ముప్పా వెంకయ్య చౌదరి సమర్పణలో అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకాలపై అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు నిర్మిస్తున్నారు. లేడీ సూపర్ స్టార్ విజయశాంతి పవర్ ఫుల్ పోలీస్ అధికారిణిగా నటిస్తున్న ఈ సినిమాలో ఆమె కొడుకుగా కళ్యాణ్ రామ్ నటిస్తున్నాడు. ఇది తల్లీ కొడుకుల బలమైన భావోద్వేగాల నేపథ్యంలో సాగే యాక్షన్ మూవీ అని తెలుస్తోంది.

గతంలో విజయశాంతి పోలీస్ ఆఫీసర్ గా వైజయంతి పాత్రలో నటించిన ‘కర్తవ్యం’  సినిమాకు గాను ఉత్తమ నటిగా జాతీయ అవార్డును అందుకుంది. దాంతో ఈ సినిమాలో కూడా విజయశాంతి పోషిస్తున్న పాత్రకూ వైజయంతి అనే పేరు పెట్టినట్లు తెలుస్తోంది.