ఇట్స్ అఫీషియల్.. ‘జైలర్‌ 2’లో షారుక్‌ ఖాన్‌

by | Feb 2, 2026 | సినిమా

సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajanikanth) కథానాయకుడిగా, దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ (Nelson Dileep Kumar) తెరకెక్కిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ‘జైలర్ 2’ నుంచి ఒక క్రేజీ అప్‌డేట్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఈ సీక్వెల్‌లో బాలీవుడ్ అగ్ర హీరో షారుక్ ఖాన్ (Sharukh Khan) నటిస్తున్నారంటూ గత కొద్దిరోజులుగా వార్త‌లు వ‌స్తున్న విష‌యం తెలిసిందే. ఈ వార్త‌ల‌ను నిజం చేస్తూ ఈ సినిమాలో షారుక్ ఖాన్ నటించనున్నట్లు తాజాగా అఫీషియల్ గా ప్రకటించారు మేకర్స్. కాగా, ప్రస్తుతం ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తదుపరి షెడ్యూల్‌ ముంబైలో జరుగనుండగా.. ఈ షెడ్యూల్‌లో షారుక్‌ ఖాన్‌ చేరబోతున్నాడు. ఈ షెడ్యూల్‌లో షారుక్‌ఖాన్‌పై వచ్చే కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నట్టు తెలుస్తోంది.

ఇక జైలర్ మొదటి భాగంలో రమ్యకృష్ణ (Ramya Krishna) , వినాయకన్‌, వసంత్‌ రవి, మోహన్‌ లాల్‌ (Mohan Lal) , శివరాజ్‌ కుమార్‌ (Shivaraj Kumar) , తమన్నా (Thamanna) కీలక పాత్రల్లో నటించగా.. రెండో భాగంలో శివరాజ్‌కుమార్‌, మోహన్‌ లాల్ (Mohan Lal) పాత్రలు రిపీట్ కానున్నాయని ఇప్పటికే వార్తలు వచ్చాయి. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్న ఈ భారీ మల్టీస్టారర్ చిత్రాన్ని 2026 జూన్ 12న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ముత్తువేల్ పాండియన్ పాత్రలో రజనీకాంత్ ఈసారి ఎలాంటి విధ్వంసం సృష్టిస్తారో అని అభిమానులు వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నారు.