మెగాప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej) ప్రస్తుతం మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘కొరియన్ కనకరాజు’ (Korean Kanaka Raj) చిత్రంలో నటిస్తున్నారన్న సంగతి తెలిసిందే. హారర్ కామెడీ జానర్‌లో, రూపొందుతున్న ఈ సినిమాపై అభిమానుల్లో అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ చిత్రాన్ని ఈ ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని భావిస్తున్నారు మేకర్స్. అయితే ఈ సినిమా సెట్స్ మీద ఉండగానే వరుణ్ తేజ్ మరో భారీ ప్రాజెక్ట్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారనే వార్త ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీతో వరుణ్ తేజ్ సినిమా చేయబోతున్నారనే వార్త ప్రస్తుతం ఆసక్తిగా మారింది. ‘జవాన్’ వంటి సూపర్ హిట్ తో బాలీవుడ్ లో సత్తా చాటిన అట్లీ ప్రస్తుతం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌తో (Allu Arjun) ఓ భారీ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. సన్ పిక్చర్స్ భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
అయితే ఈ సినిమా పూర్తవగానే వరుణ్ తేజ్‌తో సినిమా చేయాలని అట్లీ ప్లాన్ చేస్తున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. వరుణ్ తేజ్ బాడీ లాంగ్వేజ్ కు సరిపోయేలా అట్లీ (Atlee) ఇప్పటికే ఓ పవర్‌ఫుల్ స్క్రిప్టును రెడీ చేశారనే టాక్ నడుస్తోంది. అయితే గత కొన్నేళ్లుగా వరుణ్ తేజ్ సినిమాలు విమర్శకుల ప్రశంసలు అందుకున్నప్పటికీ బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో వసూళ్లు రాకపోవడంతో సరైన బ్లాక్‌బస్టర్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఒకవేళ అట్లీతో సినిమా కనుక కుదిరితే వరుణ్ తేజ్ కెరీర్‌లో ఇదే భారీ ప్రాజెక్ట్ కానుంది. ఈ క్రేజీ కాంబోపై అఫీషియల్ అనౌన్స్మెంట్ రాకపోయినా ఈ న్యూస్ మాత్రం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.

