‘ది ప్యారడైజ్‌’ – మోహన్ బాబు పాత్ర అదేనా.?

by | Feb 2, 2026 | సినిమా

నేచురల్ స్టార్ నాని (Nani), యువ డైరెక్టర్ శ్రీకాంత్‌ ఓదెల (Srikanth Odela) కాంబోలో తెరకెక్కుతున్న మోస్ట్‌ అవెయిటెడ్‌ మూవీ ‘ది ప్యారడైజ్‌’ (The Paradise) ఈ సినిమాలో కలెక్షన్ కింగ్ మోహన్‌ బాబు (Mohan Babu) ముఖ్య పాత్రలో నటిస్తుండగా.. సంపూర్ణేష్ బాబు (Sampoornesh Babu), తనికెళ్ల భరణి, కిల్‌ ఫేం రాఘవ్‌ జుయల్‌ ఇతర కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇక సోనాలి కులకర్ణి (Sonali Kulakarni) ఈ చిత్రంలో నాని తల్లిగా కనిపించనుంది. ఇక నాని, మోహన్ బాబులను ఒకే సారి స్క్రీన్‌పై చూడబోతున్నాం అనే ఫీలింగే ఒక హై ఇస్తుంది. అందులోనూ హీరోగా ఒకరు విలన్‌గా మరొకరు కనిపిస్తారనడం గూస్‌బంప్స్ తెప్పిస్తుంది. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ఇది పెంపుడు తండ్రి, కొడుకుల కథ అని తెలుస్తుంది. నానికి పెంపుడు తండ్రి పాత్రలో మోహన్ బాబు (Mohan Babu) కనిపించబోతున్నాడట. తండ్రీకొడుకుల్లా ఉండే వీరిద్దరూ చివరికి శత్రువులుగా మారితే ఎలా ఉంటుంది అనే కోణంలో కథనం సాగుతుందట. ఇందులో నిజమెంతుందో తెలియదు కానీ ఇలాంటి కథలను మనం ఎప్పుడూ చూడలేదు. డిఫరెంట్ కాన్సెప్ట్ తో రానున్న ఈ చిత్రంలో ఇలా స్టార్‌ హీరోలు చేయడం ఇదే తొలిసారి. దాంతో ఇండస్ట్రీలలో ఎక్కడలేని అంచనాలు క్రియేట్‌ అయ్యాయి.

కాగా, ఈ చిత్రాన్ని ఎస్‌ఎల్‌వీ సినిమాస్ బ్యానర్‌లో సుధాకర్‌ చెరుకూరి తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి అనిరుధ్‌ రవిచందర్‌ మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన అప్డేట్స్, పోస్టర్లు సినిమాపై హైప్‌ను మరింత క్రియేట్ చేశాయి. ఈ చిత్రాన్ని 2026 మార్చి 26న వరల్డ్‌వైడ్ రిలీజ్ చేస్తామని గతంలో చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించింది. అయితే ప్రస్తుత పరిస్థితులను చూస్తే అనుకున్న తేదీకి సినిమా విడుదలవడం కష్టమేనన్న టాక్ ఇండస్ట్రీలో బలంగా వినిపిస్తోంది. ప్రస్తుతం సినిమా షూటింగ్ ఇంకా పూర్తి కాలేదు. ముఖ్యమైన షెడ్యూల్స్ మిగిలి ఉండటంతో పాటు, భారీ ఎత్తున రూపొందుతున్న ఈ సినిమాకు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా ఎక్కువ సమయం తీసుకునే అవకాశముంది. తాజా సమాచారం ప్రకారం ‘ది ప్యారడైజ్’ చిత్రాన్ని జూన్ 25న విడుదల చేయాలనే ఆలోచనలో చిత్ర బృందం ఉన్నారట. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానున్నట్లుగా సమాచారం.