‘సంక్రాంతికి వస్తున్నాం’ 50డేస్ జాతర.. అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా!
టాలీవుడ్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ నటించిన రీసెంట్ బ్లాక్ బస్టర్ మూవీ ‘సంక్రాంతికి వస్తున్నాం’.ఈ చిత్రాన్ని అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందించగా.. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు ఈ సినిమాను నిర్మించాడు. ఇందులో మీనాక్షి చౌదరి, ఐశ్వర్యా రాజేశ్ (Aishwarya Rajesh) హీరోయిన్లుగా నటించారు. జనవరి 14న రిలీజైన ఈ సినిమా వరల్డ్ప్రపంచవ్యాప్తంగాగా రూ.300 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది. దాంతో హీరో వెంకటేష్ కెరీర్లో కలెక్షన్ల పరంగా అతి పెద్ద సినిమాగా అవతరించింది. ఇందులో వెంకీ (Venkatesh) నటనకు, కామెడీ టైమింగ్ కు ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. వారి ఈలలు, చప్పట్లతో థియేటర్లు దద్దరిల్లాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్లోనూ ఈ సినిమా ఘన విజయాన్ని అందుకుంది.
ఈ క్రమంలోనే తాజాగా ‘సంక్రాంతికి వస్తున్నాం'(Sankranthiki Vasthunnam) మూవీ ఓ అరుదైన ఘనతను ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం ఒక సినిమా నాలుగు వారాలు థియేటర్లలో ఉండడమే కష్టంగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీ ఏకంగా 92 సెంటర్లలో 50 రోజుల థియేట్రికల్ రన్ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం ఈ ఘనత సాధించడమనేది గొప్ప విషయమనే చెప్పాలి. దీంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాగా, ఈ సినిమా మార్చి 1న ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ జీ5 వేదికగా విడుదలైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఓటీటీ వేదికగా కూడా సంక్రాంతికి వస్తున్నాం మూవీ ఓ అరుదైన రికార్డ్ ఖాతాలో వేసుకుంది. ఓటీటీ ప్లాట్ ఫామ్ జీ5 (ZEE5) హిస్టరీలోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్ సాధించిన మూవీగా ‘సంక్రాంతికి వస్తున్నాం’ ఘనత సాధించింది. కాగా, ఈ మూవీ జీ5లో తెలుగుతో పాటు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ అవుతున్న సంగతి తెలిసిందే.

