మెగాస్టార్ చిరంజీవి నటించిన రుద్రవీణ చిత్రం విడుదలై నేటికీ 37 సంవత్సరాలు అయ్యింది. రుద్రవీణ సినిమా 1988, మార్చ్ 4 న విడుదలయింది. అంజనా ప్రొడక్షన్స్ పై నాగబాబు నిర్మించిన ఈ చిత్రానికి కె బాలచందర్ దర్శకుడు
ఈ చిత్రంలో కన్నడ నటుడు రమేష్ అరవింద్ మొదటిసారి తెలుగులో నటించాడు. తమిళ నటుడు జెమినీ గణేశన్ ప్రధాన పాత్రలో నటించారు. నటి శోభన్ చిరంజీవి (Chiranjeevi) కి జంటగా నటించింది.
రుద్రవీణ (Rudraveena) చిత్రానికి, ఇళయరాజా స్వరాలూ సమకూర్చారు. ఈ చిత్రంలోని పాటలన్ని సూపర్ హిట్. ముఖ్యంగా లలిత ప్రియకమలం, నమ్మకు నమ్మకు ఈ రేయిని వంటి పాటలు ఈ రోజు కు టెలివిజన్ లో ప్రసారమవుతూ ఉంటాయి. ఈ చిత్రంలోని పాటలన్ని సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు రాశారు
విరుద్ధ భావాలూ కలిగిన తండ్రి కొడుకుల మధ్య సంఘర్షణ ఈ రుద్రవీణ. తండ్రి బిలహరి గణపతి శాస్త్రి కర్ణాటక సంగీత విద్వాంసుడు (జెమినీ గణేశన్). తన తండ్రి కులం, మతం, తక్కువ జాతి, ఎక్కువ జాతి అని చూపించే బేధాలు కొడుకు సూర్యం (చిరంజీవి) కు నచ్చవు. తండ్రి తో గొడవపడి ఇంటి నుండి బయటకు వచ్చేస్తాడు కొడుకు సూర్యం. బయటకు వచ్చిన సూర్యం సమాజ శ్రేయస్సే, దేశ, రాష్ట్ర శ్రేయస్సు అని తాను నమ్మిన సిద్ధాంతం కోసం పని చేస్తూ ఉంటాడు. చివరకు, కొడుకు సూర్యం సాధించిన దానిని చూసి, తండ్రి బిలహరి గణపతి శాస్త్రి అభిప్రాయాలలో కూడా మార్పు వస్తుంది. గణేష్ పాత్రో ఈ రుద్రవీణ చిత్రానికి మాటలు రాశారు
క్రిటిక్స్ నుండి ప్రశంసలు వచ్చినా , రుద్రవీణ కమర్షియల్ గా ఫెయిల్ అయ్యింది. 80 లక్షలతో తీసిన సినిమాకు, 60 లక్షల నష్టం వచ్చింది
గతంలో చిరంజీవి(Chiranjeevi) , బాలచందర్ దర్శకత్వంలో ఇది కధ కాదు, 47 రోజులు చిత్రాలలో నటించారు. అయితే ఈ రెండు చిత్రాలలో చిరంజీవిది నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలు. ఆ తరవాత దర్శకుడు బాలచందర్ మాట్లాడుతూ చిరంజీవిలో ఒక కమలహాసన్, ఒక రజనీకాంత్ ఉన్నారని అన్నారు. చిరంజీవి కి వచ్చిన బెస్ట్ కాప్లిమెంట్స్ లో ఇది ఒకటి
రుద్రవీణ చిత్రానికి 3 జాతీయ అవార్డు లు వచ్చాయి. బెస్ట్ మేల్ ప్లేబాక్ సింగర్ గా ఎస్ పి బాల సుబ్రహ్మణ్యం కు, ఉత్తమ సంగీత దర్శకుడిగా ఇళయరాజాకు, జాతీయ సమైక్యతను పెంపొందించి ఉత్తమ్ చిత్రంగా ఇచ్చే నర్గిస్ దత్ అవార్డు. కె విశ్వనాధ్ సప్తపది తరవాత నర్గిస్ దత్ అవార్డు వచ్చిన సినిమా రుద్రవీణ మాత్రమే
రుద్రవీణ చిత్రం క్లైమాక్స్ లో ప్రధాన మంత్రి, సూర్యం పాత్రధారి చిరంజీవిని సన్మానించడానికి వాళ్ళ గ్రామం వస్తాడు. చిరంజీవి నిజ జీవితంలో, అప్పటి రాష్ట్రపతి ఏ పి జె అబ్దుల్ కలామ్, 2006 జూన్ చిరంజీవి బ్లడ్ మరియు ఐ బ్యాంకు ను సందర్శించి చిరంజీవి తీసుకున్న చొరవని అభినందించారు
కొరటాల శివ, మహేష్ బాబుతో తీసిన శ్రీమంతుడు సినిమాకు, రుద్రవీణ కు దగ్గర పోలికలు ఉంటాయి
రుద్రవీణ (Rudraveena) చిత్రం కమర్షియల్ గా హిట్ అవనప్పటికీ, ఈ చిత్రంలో నటించినందుకు చిరంజీవి ఆనందించారు. ఒక మంచి సినిమా లో నటించానన్న సంతృప్తి ఉంది అని అన్నారు. అంతకు ముందే, పసివాడి ప్రాణం, జేబుదొంగ, మంచి దొంగ వంటి కమర్షియల్ చిత్రాలలో నటించారు. అయినా లాభాపేక్ష లేకుండా, తన సొంత బ్యానర్లో తమ్ముడు నాగబాబు నిర్మాత గా సామజిక బాధ్యతతో తీసిన చిత్రం రుద్రవీణ. ఒక నటుడికి సామజిక బాధ్యత ఎంత అవసరమో చిరంజీవి ఈ చిత్రం చేసి చూపించారు.
రుద్రవీణ సినిమాలో, సమాజంలో సమానత్వం, మహిళ సాధికారత, పేదరికం, సామాజిక భేదాలు వంటి అంశాలను కూడా ప్రస్తావించారు. సంప్రదాయాలు, సిద్ధాంతాలు అనే ఛాందస భావాలను ఉతికి ఆరేసిన చిత్రం రుద్రవీణ.
సామజిక మార్పు కోసం, వ్యక్తులు పోరాడే పాత్రను సూర్యం పాత్ర ద్వారా చూపించింది. ప్రజలకు సేవ చేయడం, వారి సమస్యలను తీర్చడం కోసం సూర్యం చేసిన ప్రయత్నాలు ఆలోచింపచేసేలా, స్ఫూర్తిదాయకంగా ఉంటాయి
గ్రామీణాభివృద్ధి కోసం చేసిన ‘లలిత గ్రామీణ స్వీయశిక్షణ ఉద్యమం’. మద్యానికి బానిసలై తమ జీవితాలను నాశనం చేసుకుంటున్న వాళ్ళని మద్యం మానిపించడం కోసం సూర్యం పాత్రధారి చిరంజీవి చేసిన త్యాగాల ద్వారా మద్యపాన నిషేధం లాంటి అంశాన్ని లేవనెత్తారు. 28 గ్రామాలూ సూర్యం పాత్రధారి చూపించిన బాటలో నడిచి అభివృద్ధిని సాధించడం, శ్రమదానం స్వశక్తితో గ్రామసీమల సముద్ధరణ వంటి వంటి అంశాలు స్ఫూర్తిదాయకంగా ఉంటాయి.
ఆదర్శాలకే ఆదర్శంగా నిలిచే మా మెగాస్టార్ చిరంజీవి (Mega Star Chiranjeevi) చిత్రం ఎప్పుడు అందరికి ఆదర్శమే.
ఐ ఎమ్ డి బి లో రుద్రవీణ చిత్రానికి రేటింగ్ 8.6/10

