సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌ల కాంబోలో ‘స్పిరిట్’ (Spirit) అనే చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ సినిమాలో ప్రభాస్ పవర్ ఫుల్ పోలీసు అధికారిగా కనిపించనున్నారు. త్రిప్తి దిమ్రీ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని టీ సిరీస్ ఫిల్మ్స్, భద్రకాళి పిక్చర్స్ పతాకాలపై భూషణ్ కుమార్, ప్రణయ్‌రెడ్డి వంగా, క్రిషన్ కుమార్ నిర్మిస్తున్నారు. ప్రకాశ్ రాజ్, వివేక్ ఒబెరాయ్, సీనియర్ నటి కాంచన కీలక పాత్రలు పోషిస్తున్నారు. పాన్ వరల్డ్ స్థాయిలో రూపొందుతున్న ఈ చిత్రానికి హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా రెగ్యులర్ చిత్రీకరణ శరవేగంగా జరుగుతుంది. ఈ సినిమాకు సంబంధించి గతేడాది రిలీజ్ చేసిన వాయిస్ గ్లింప్స్, రీసెంట్గా వదిలిన పోస్టర్ ఇలా అన్నీ సినిమాపై అంచనాలను పెంచేస్తున్నాయి.
అయితే నూతన సంవత్సరం కానుకగా ‘స్పిరిట్’ మూవీలో ప్రభాస్ (Prabhas) ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేసిన మేకర్స్ ఇటీవలే సంక్రాంతి కానుకగా ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించారు. 2027 మార్చి 5న ప్రపంచవ్యాప్తంగా తెలుగుతో పాటు, ఇంగ్లీష్, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ, చైనీస్, జపనీస్, కొరియన్ వంటి తొమ్మిది భాషల్లో ఈ మూవీని రిలీజ్ చేస్తున్నట్లు నిర్మాతలు వెల్లడించారు. అయితే ఈ సినిమా విడుదల తేదీ వెనుక డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా మాస్టర్ స్కెచ్ ఉందని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. 2027 మార్చి 5న శుక్రవారం ‘స్పిరిట్’ (Spirit) మూవీ రిలీజైతే ఆ వెంటనే మార్చి 6న శనివారం మహా శివరాత్రి సెలవు, మార్చి 7న ఆదివారం వస్తుంది. ఆ తర్వాత స్వల్ప వ్యవధిలోనే రంజాన్, హోలీ, గుడ్ ఫ్రైడే వంటి సెలవు రోజులు రానున్నాయి. హీరో ప్రభాస్ గ్రేస్ కు తోడుగా ఈ మొత్తం హాలిడేస్ ను ఉపయోగించుకుంటే నాలుగు వారాల పాటుగా బాక్సాఫీస్ వద్ద సినిమాకు తిరుగుండదని దర్శకుడు సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) పక్కాగా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

