మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘మన శంకరవరప్రసాద్ గారు’. స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్‌గా నటించగా విక్టరీ వెంకటేశ్ ముఖ్య పాత్రలో అలరించారు. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా తొలిరోజే సూపర్ హిట్ టాక్ దక్కించుకుంది.
ఈ క్రమంలోనే, ఆరు రోజుల్లోనే, ఈ మూవీ 261 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టడం విశేషం. అయితే, ఈ సినిమా ప్రముఖ ఆన్‌టైన్ టికెట్ బుకింగ్ ప్లాట్‌ఫామ్ బుక్ మై షోలో కూడా సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. గడిచిన 24 గంటల్లో ఈ సినిమాకు ఏకంగా 300K+ టికెట్ బుకింగ్స్ జరిగినట్లు బుక్ మై షో వెల్లడించింది. ఇటీవలి కాలంలో ఓ తెలుగు చిత్రానికి ఈ రేంజ్‌లో టికెట్ బుకింగ్స్ జరగడం రికార్డ్ అని చెప్పాలి.
ఇక ‘మన శంకరవరప్రసాద్’ తెలుగు రాష్ట్రాలతోపాటు ఓవర్సీస్లోనూ అదరగొడుతున్నాడు. ముఖ్యంగా నార్త్ అమెరికాలో మాత్రం ఈ సినిమా జోరు కొనసాగుతోంది. మెగాస్టార్ మేనియా చూసేందుకు అభిమానులు థియేటర్లకు పరుగులు తీస్తున్నారు. దీంతో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురుస్తోంది. ఈ క్రమంలోనే ఈ సినిమా మరో అరుదైన ఘనతను సాధించింది. నార్త్ అమెరికాలో 2.5 మిలియన్ డాలర్ల మార్క్‌ను దాటేసి అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. ఇంత తక్కువ టైమ్‌లోనే 2.5 మిలియన్ డాలర్లు వసూల్ చేసిందంటే ఓవర్సీస్ మార్కెట్లో చిరంజీవికు ఏ రేంజ్‌లో మార్కెట్ ఉందో అర్థం చేసుకోవచ్చు
ఈ మూవీ శాటిలైట్, ఓటీటీ రైట్స్ కూడా ఫ్యాన్సీ ధరకు అమ్ముడవ్వడంతో సినిమా ఇప్పటికే నిర్మాతలకు మంచి లాభాలని తెచ్చిపెడుతోంది. జీ తెలుగు వారు మన శంకర వర ప్రసాద గారు శాటిలైట్ మరియు డిజిటల్ హక్కులను చేజిక్కించుకున్నారు వీ శాటిలైట్, ఓటీటీ రైట్స్ కూడా ఫ్యాన్సీ ధరకు అమ్ముడవ్వడంతో సినిమా ఇప్పటికే నిర్మాతలకు మంచి లాభాలని తెచ్చిపెడుతోంది.

