‘స్పిరిట్’: ప్రభాస్‌కు సందీప్‌ సీరియస్ కండీషన్స్!

by | Mar 12, 2025 | సినిమా

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న చిత్రం ‘స్పిరిట్’. ఈ మూవీలో ప్రభాస్ తొలిసారిగా పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. దాదాపు రూ. 300 కోట్లకు పైగా బడ్జెట్‌తో రానున్న ఈ మూవీని టీ సిరీస్, భద్రకాళి పిక్చర్స్ నిర్మించ‌నున్నారు. అయితే ఈ సినిమా షూటింగ్‌ మొదలవడానికి ముందే హీరో ప్రభాస్‌ (Prabhas) కి డైరెక్టర్ సందీప్‌ రెడ్డి వంగా కొన్ని నిబంధనలు విధించినట్లు తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం స్పిరిట్ మూవీ షూటింగ్‌ కోసం ప్రభాస్ విరామం లేకుండా 65 రోజుల డేట్స్ ఇవ్వాలని చెప్పాడట. అలాగే స్పిరిట్‌ మూవీ కోసం డూప్‌ని వాడకూడదని సీరియస్ గా చెప్పాడట. ఎలాంటి రిస్కీ షాట్స్ అయినా యాక్షన్ సీక్వెన్స్ అయినా ప్రభాసే చేయాలని తెల్చిచెప్పాడట.

ఇటీవలి కాలంలో అగ్ర హీరోలందరూ డూప్‌లతోనే యాక్షన్‌ సీన్స్‌తో చేస్తున్నారు. ఈ క్రమంలోనే మూవీ రియలెస్టిక్ గా ఉండాలని సందీప్‌ (Sandeep Reddy Vanga) డూప్ లేకుండా చేయాలని ప్రభాస్ ను కోరినట్లు తెలుస్తోంది. ఇదిలాఉంటే.. స్పిరిట్ మూవీ రెగ్యులర్ షూటింగ్ జూన్‌ రెండో వారంలో మొదలెట్టాలని చూస్తున్నట్లు సమాచారం. భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి కానుకగా రిలీజ్ చేయాలని సందీప్ రెడ్డి వంగా యోచిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా, స్పిరిట్ (Spirit) మూవీకి హర్షవర్థన్‌ రామేశ్వర్‌ మ్యూజిక్ అందిస్తుండగా..ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ కపుల్ సైఫ్ అలీఖాన్, కరీనా కపూర్, మాలీవుడ్ స్టార్ హీరో మమ్మూట్టి కీలక పాత్రల్లో నటించనున్నట్లు తెలుస్తోంది.