మావోయిస్టుల అడ్డాలో.. మహేశ్ మూవీ షూటింగ్

by | Mar 12, 2025 | సినిమా

దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి, సూపర్ స్టార్ మహేశ్‌బాబల కాంబినేషన్‌లో ఒక భారీ ప్రాజెక్ట్‌ రూపొందనున్న సంగతి తెలిసిందే. ‘SSMB29’ వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై కేఎల్ నారాయణ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇందులో హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా నటిస్తోంది. ఈ సినిమాకు ఆస్కార్ విన్నర్ కీరవాణి సంగీతం సమకూర్చనున్నారు. అయితే, ప్ర‌స్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా.. ఒడిషాలోని కోరాపుట్‌ అటవీ ప్రాంతంలో కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. అయితే ఒకప్పుడు మావోయిస్టుల అడ్డాగా ఉన్నటువంటి ఒడిశాలోని కొరాపుట్‌ జిల్లా ప్రస్తుతం షూటింగ్ స్పాట్ గా మారింది. ఒకప్పుడు ఈ ప్రాంతానికి రావాలంటే భయపడిన వారే ప్రస్తుతం ఇక్కడి ప్రకృతి అందాలను చూసి మైమరచిపోతున్నారు. విహార యాత్రలకు కోసం తరలివస్తున్నారు. ప్రస్తుతం మహేశ్ బాబు-రాజమౌళి (Rajamouli) మూవీ షూటింగ్ ఆంధ్ర, ఒడిశా సరిహద్దు సాలూరుకి దగ్గర్లోని దేవమాలి పర్వతంపై జరుగుతోంది.

కాగా, మహేశ్-రాజమౌళి (Mahesh Babu) మూవీపై స్వయంగా ఒడిశా రాష్ట్ర ఉపముఖ్యమంత్రి ప్రవతి పరిడ ట్వీట్ చేయడం ఆసక్తికరంగా మారింది. రాజమౌళి తమ ప్రాంతంలో షూటింగ్‌ చేయడంపై హర్షం వ్యక్తం చేశారు. తాము పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని ప్రకటించారు. గతంలో మల్కన్ గిరిలో పుష్ప 2, ఇప్పుడు రాజమౌళి, మహేశ్ బాబు, మాలీవుడ్ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్, బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా ఇక్కడ షూటింగ్ లో పాల్గొంటున్నారు. దీనిబట్టి ఒడిశా చిత్రసీమకు పర్యటక రంగానికి స్వర్గధామం అని చెప్పొచ్చు అని ప్రవిత పరిడ చెప్పుకొచ్చారు.