‘ఛావా’ తెలుగులో 5 డేస్ కలెక్షన్స్.. ఇది కదా రికార్డ్!

by | Mar 12, 2025 | సినిమా

బాలీవుడ్ యంగ్ హీరో విక్కీ కౌశ‌ల్ ప్ర‌ధాన పాత్ర‌లో వ‌చ్చిన తాజా చిత్రం ‘ఛావా’. ఇందులో ర‌ష్మిక మంద‌న్నా కథానాయికగా న‌టించ‌గా.. ల‌క్ష్మ‌ణ్ ఉటేక‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. మ‌హరాష్ట్ర యోధుడు ఛ‌త్ర‌పతి శివాజీ మ‌హ‌రాజ్ కొడుకు శంభాజీ మ‌హరాజ్ జీవిత చ‌రిత్ర ఆధారంగా ఈ సినిమా వ‌చ్చింది. విక్కీ కౌశ‌ల్ ఇందులో శంభాజీ మహరాజ్ పాత్ర పోషించగా.. ఆయ‌న భార్య యెసుబాయ్ పాత్ర‌ను ర‌ష్మిక మందన్నా పోషించారు. కాగా, శివాజీ సావంత్ రాసిన ‘ఛావా’ ఆధారంగానే ఈ సినిమా తెరకెక్కగా.. గతేడాది ‘స్త్రీ-2’తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన దినేశ్ విజాన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాలో ఔరంగజేబ్ పాత్రలో బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ ఖన్నా నటించగా.. మ్యూజిక్ మాస్ట్రో ఎ.ఆర్.రహమాన్ సంగీతం అందించారు. ఫిబ్ర‌వ‌రి 14న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ఈ చిత్రం సూప‌ర్ హిట్ టాక్‌తో దూసుకెళ్తోంది. ఇక ఈ మూవీ వరల్డ్ వైడ్ గా ఈ ఇప్పటి వరకు రూ. 535.8 కోట్ల నెట్ వసూళ్లు రాబట్టినట్లు సమాచారం.

ఈ నేపథ్యంలోనే ఈ సినిమా తెలుగు డబ్బింగ్‌ వెర్షన్‌ ను గీతా ఆర్ట్స్‌ సంస్థ మార్చి 7న తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎత్తున విడుదల చేసింది. అయితే తెలుగులోనూ ఈ సినిమాకు ప్రేక్షకులు నీరాజనం పలుకుతున్నారు. దాంతో ఈ చిత్రం తొలి రోజు నుంచే బాక్సఫీస్ వద్ద సాలిడ్ కలెక్షన్లు వసూలు చేస్తోంది. ఇప్పటికి తెలుగులో విజయవంతంగా 5 రోజుల థియేట్రికల్ రన్ పూర్తి చేసుకున్న ఛావా మొత్తంగా రూ. 11.91 కోట్ల గ్రాస్ ని వసూలు చేసినట్లు మేకర్స్ ప్రకటించారు. ప్రస్తుతం తెలుగులో ‘ఛావా’ జోరు చూస్తుంటే హోలితో పాటుగా వీకెండ్‌ కలిసిరావడంతో కలెక్షన్స్‌ భారీగా పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. ఒక హిస్టారికల్ డబ్బింగ్ మూవీకి ఈ రేంజ్​లో కలెక్షన్లు రావడం చాలా అరుదంటూ సినీ విశ్లేషకులు పేర్కొంటున్నారు. బ్లాక్‌బస్టర్‌ హిట్‌గా నిలిచిన ఈ సినిమా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లోకి ఎప్పుడొస్తుందా అని సినీ ప్రియులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అయితే ‘ఛావా’ సినిమా డిజిటల్ రైట్స్ ప్రముఖ ఓటీటీ ప్లాట్​ఫామ్ నెట్​ఫ్లిక్స్ భారీ ధరకు సొంతం చేసుకున్నట్లు సమాచారం.