‘దిల్ రూబా’ రన్ టైం ఇదే.. అదిరిన సెన్సార్ టాక్

by | Mar 12, 2025 | Uncategorized

టాలీవుడ్ యువ కథానాయకుడు కిరణ్‌ అబ్బవరం (Kiran Abbavaram) , యంగ్ హీరోయిన్ క్వీన్ రుక్సార్‌ థిల్లాన్‌ జంటగా నటించిన తాజా చిత్రం ‘దిల్‌ రూబా’. లవ్‌ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను తెరకెక్కిన ఈ చిత్రానికి విశ్వ కరుణ్‌ దర్శకత్వం వహించారు. ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజైన పోస్టర్స్, టీజర్, ట్రైలర్‌లకు అభిమానుల నుంచి అద్భుతమైన స్పందన వస్తోంది. ఈ సినిమాను శివమ్‌ సెల్యూలాయిడ్స్‌, సారెగమ మ్యూజిక్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ మూవీకి రవి, జోజో జోస్, రాకేష్ రెడ్డి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. సామ్‌ సీఎస్‌ సంగీతం అందిస్తున్న.. ఈ మూవీలో నజియా కీలక పాత్రలో నటిస్తోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న దిల్‌ రుబా (Dil Ruba) మార్చి 14న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. రిలీజ్ డేట్ దగ్గర పడడంతో ప్రమోషన్లలో జోరు పెంచారు మేకర్స్.

ఈ నేపథ్యంలోనే ఇటీవలే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ముగియగా.. తాజాగా సెన్సార్ ని కూడా ఈ చిత్రం పూర్తి చేసుకుంది. ఈ సినిమాకి సెన్సార్ వారు యూ/ఏ సర్టిఫికెట్ ని అందించగా అఫీషియల్ రన్ టైం కూడా సినిమాకి లాక్ అయ్యినట్టుగా తెలుస్తుంది. మార్చి 14న విడుదల కాబోతున్న ఈ మూవీ 140 నిమిషాల రన్ టైం ని ఫిక్స్ చేసుకున్నట్టుగా సమాచారం. ఫుల్ లెంగ్త్ లవ్ అండ్ యాక్షన్‌ డ్రామా ప్రాజెక్ట్‌ను ఈ నిడివి పర్‌ఫెక్ట్‌గా బ్యాలెన్స్ చేస్తుందని ట్రేడ్‌ పండితులు చెబుతున్నారు. ఇక డీసెంట్ రన్ టైం ని లాక్ చేసుకున్న ఈ మూవీకి రెండు తెలుగు రాష్ట్రాల్లో సాలిడ్ గానే నిర్మాతలు ప్రీమియర్స్ ప్లాన్ చేస్తున్నారు. మొత్తంగా 20 ప్రీమియర్స్ ని మార్చి 13 సాయంత్రం ప్రారంభించనున్నారు. మరి ఈ సినిమాకు బిగ్ స్క్రీన్ మీద ఎలాంటి స్పందన వస్తుందో అనేది చూడాలి.