‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’ ప్రీటీజర్ డేట్ ఫిక్స్

by | Mar 12, 2025 | సినిమా

టాలీవుడ్ స్టార్ హీరో నందమూరి కళ్యాణ్ రామ్ కథానాయకుడిగా ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’. ఇందులో సాయి మంజ్రేకర్ హీరోయిన్‌గా నటిస్తోంది. భారీ బడ్జెట్ తో ముప్పా వెంకయ్య చౌదరి సమర్పణలో అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకాలపై అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు నిర్మిస్తున్నారు. లేడీ సూపర్ స్టార్ విజయశాంతి పవర్ ఫుల్ పోలీస్ అధికారిణిగా నటిస్తున్న ఈ సినిమాలో ఆమె కొడుకుగా కళ్యాణ్ రామ్ నటిస్తున్నాడు. ఈ క్రమంలోనే ఉమెన్స్ డే రోజు టైటిల్ అనౌన్స్మెంట్ తో పాటుగా విజయశాంతి, కళ్యాణ్ రామ్ పవర్ ఫుల్ గా నడిచి వస్తున్న ఫస్ట్ లుక్ పోస్టర్ నూ రిలీజ్ చేశారు. అయితే తాజాగా ఈ సినిమా నుంచి మేకర్స్ మరో అదిరిపోయే అప్డేట్ ని అందించారు. ఈ సినిమా ప్రీ టీజర్ ని మార్చి 14న రిలీజ్ చేస్తున్నట్లుగా ప్రకటించారు. ఈ క్రమంలోనే కళ్యాణ్ రామ్ (Kalyan Ram) అల్ట్రా స్టైలిష్ లుక్ లో నడిచివస్తున్న పోస్టర్ రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఈ మూవీ ప్రీ టీజర్ రిలీజ్ కు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. మేకర్స్ ఇప్పటికే ప్రీ టీజర్ ఫైనల్‌ కట్‌, మ్యూజిక్ మిక్సింగ్‌లో బిజీగా ఉన్నారని తెలుస్తోంది.

కాగా, ఈ సినిమాలో శ్రీకాంత్, సాయి మంజ్రేకర్, యానిమల్ ఫేమ్ పృథ్వీరాజ్ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకు తమ్మిరాజు ఎడిటర్‌గా ఉండగా, రామ్ ప్రసాద్ సినిమాటోగ్రాఫర్‌గా ఉన్నారు. ఈ సినిమాకు అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందిస్తున్నారు. ఇదిలాఉంటే.. గతంలో విజయశాంతి పోలీస్ ఆఫీసర్ గా వైజయంతి పాత్రలో నటించిన ‘కర్తవ్యం’ సినిమాకు గాను ఉత్తమ నటిగా జాతీయ అవార్డును అందుకుంది. దాంతో ఈ సినిమాలో కూడా విజయశాంతి (Vijaya Shanthi) పోషిస్తున్న పాత్రకూ వైజయంతి అనే పేరు పెట్టినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో ఆమె పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందా అని అబిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు.