అప్పటి వరకూ ఆగాల్సిందే.. త్రివిక్రమ్‌కు బన్నీ కండీషన్

by | Mar 12, 2025 | సినిమా

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ టైటిల్‌ పాత్రలో నటించిన సీక్వెల్‌ మూవీ పుష్ప 2 ది రూల్‌. సీనియర్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా గతేడాది డిసెంబర్ 5న తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదలై బ్లాక్ బస్టర్ కలెక్షన్లు సాధించింది. రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటించగా.. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సీక్వెల్‌కు దేవీ శ్రీ ప్రసాద్, అద్భుతమైన మ్యూజిక్‌ అందించారు. అయితే ఈ సినిమా త‌ర్వాత అల్లు అర్జున్ (Allu Arjun) తర్వాతి ప్రాజెక్ట్ కోసం బన్నీ అభిమానులతో పాటుగా సినీ ప్రియులు ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్ర‌మంలోనే అల్లు అర్జున్ త్రివిక్ర‌మ్‌తో సినిమా చేయ‌బోతున్న‌ట్లు గత కొంత కాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాను హారికా అండ్‌ హాసినీ క్రియేషన్స్ పతాకంపై రాధాకృష్ణ, నాగవంశీ నిర్మించనున్నారు.

అయితే ఈ సినిమా కంటే ముందు జవాన్‌ లాంటి బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ కొట్టిన అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్ సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్‌ కూడా త్వరలోనే ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. నిజానికి అల్లు అర్జున్ పుష్ప2 (Pushpa) సినిమా విడుదలకు ముందే బన్నీ కోసం త్రివిక్రమ్ స్క్రిప్ట్‌ రెడీ చేశారట. పుష్ప 2 విడుదలవగానే ఈ సినిమా మొదలవుతుందని అంతా అనుకున్నారు. కానీ అల్లు అర్జున్ తివిక్రమ్‌ కంటే ముందు అట్లీతో సినిమా చేయాలని చూస్తున్నాడట. ఈ క్రమంలోనే తనతో సినిమా కోసం ఈ ఏడాది చివరి వరకూ ఆగాలని త్రివిక్రమ్‌కి అల్లు అర్జున్ కం(Allu Arjun) డీషన్ పెట్టినట్లు తెలుస్తోంది. ఈ మూవీ కంటే ముందు అట్లీతో సినిమా చేస్తానని, ఈ షూటింగ్ మధ్యలో మీ సినిమా సెట్స్ లో చేరతానని తివ్రిక్రమ్‌కి చెప్పారట. దీనికి త్రివిక్రమ్‌ కూడా అంగీకరించినట్లు తెలుస్తోంది. అట్లీతో చేయనున్న మూవీని 2026లో.. త్రివిక్రమ్‌ మూవీని 2027లో విడుదల చేయాలని అల్లు అర్జున్ భావిస్తున్నట్లు సమాచారం.