‘మజాకా’ నుండి లిరికల్ సాంగ్ విడుదల 

by | Feb 18, 2025 | సినిమా

జీ స్టూడియో సమర్పణలో, ఏ కె ఎంటర్టైన్మెంట్ మరియు హాస్య మూవీస్ సంయుక్తం గా నిర్మిస్తోన్న సినిమా ‘మజాకా’.  ఈ చిత్రం నుండి మూడవ లిరికల్ వీడియో ను విడుదల చేశారు మేకర్స్.  లియోన్ జేమ్స్ ఈ చిత్రానికి స్వరాలూ సమకూర్చారు

ఈ సినిమా మహాశివరాత్రి కానుకగా ఈ నెల 26 న విడుదలవుతోంది.  పీపుల్ స్టార్ సందీప్ కిషన్,  రీతూ వర్మ జంటగా నటించిన ఈ సినిమాకు కామెడీ చిత్రాలకు పెట్టింది పేరైన నక్కిన త్రినాధరావు దర్శకుడు.

బెజవాడ ప్రసన్న కుమార్ ఈ సినిమాకు కధ, మాటలు, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. ఈ సినిమా సాటిలైట్, డిజిటల్ హాక్కులు జీ నెట్వర్క్ వారి వద్ద ఉన్నాయి