టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ ప్రధాన పాత్రలో నటించిన తాజా సినిమా. ‘పుష్ప 2 ది రూల్’ సీనియర్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీలో రష్మీక మందన్న హీరోయిన్ గా నటించింది. గతేడాది డిసెంబర్ 5న విడుదలైనన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు ఈ సినిమా రూ.1871 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టినట్లు తాజాగా చిత్ర యూనిట్ ప్రకటించింది. తాజాగా ‘పుష్ప 2’ మూవీ రూ. 1871 కోట్ల రూపాయలను ఫిబ్రవరి 17 వరకూ వసూలు చేసినట్టు మేకర్స్ తాజాగా ప్రకటించారు.
ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. నిజానికి ‘పుష్ప 2’ సినిమా విడుదలైన డిసెంబర్ 5వ తేదీనే బాలీవుడ్ బ్లాక్ బస్టర్ మూవీ ‘ఛావా’ కూడా రిలీజ్ అవ్వాల్సి ఉంది. అయితే పుష్ప 2తో పోటీ వద్దనుకున్న ఛావా మేకర్స్ విడుదలను వాయిదా వేసుకున్నారు. అయితే వారు తీసుకున్న ఆ నిర్ణయమే ఈ రెండు సినిమాలు బ్లాక్ బస్టర్ అవ్వడానికి కారణం అని చెప్పొచ్చు. ఎందుకంటే పుష్ప 2తో పోటీ అని చూడకుండా ఛావా సినిమాను అదే రోజున విడుదల చేసుంటే రెండింటికి ఈ స్థాయి కలెక్షన్స్ వచ్చేవి కాదు. పుష్ప 2 తన థియేట్రికల్ రన్ ముంగించాక.. ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద ఛావా ఆ జోరును కొనసాగిస్తోంది. ఛావా తొలి నాలుగు రోజుల్లోనే దాదాపు రూ. 160 కోట్ల వసూళ్లను రాబట్టగా.. రాబోయే రోజుల్లో ఈ సినిమా కలెక్షన్స్ భారీగా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఏదేమైనా ఛావా నిర్మాతలు తీసుకున్న ఈ నిర్ణయం వల్ల రెండు సినిమాలు బాక్సఫీస్ వద్ద బాద్షాలుగా నిలిచాయని చెప్పవచ్చు

