ఢిల్లీ కి మహిళని సీఎం చేసే ఆలోచనలో బీజేపీ!

by | Feb 18, 2025 | రాజకీయాలు

ఇటీవల జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. 26 సంవత్సరాల తరవాత ఢిల్లీ పీఠం దక్కించుకున్న బీజేపీ సీఎంఅభ్యర్థి ఎంపికలో స్ట్రాటజిక్ కసరత్తులు చేస్తోంది

ఢిల్లీ సీఎం ప్రమాణ స్వీకారం గురువారం రామ్ లీల మైదానంలో ఉదయం 11:30 నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. గతంలో, ఇదే రామ్ లీల మైదానంలో, అరవింద్ కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీ ని స్థాపించారు.  ఇక్కడే, ఇప్పుడు బీజేపీ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.

అయితే సీఎం అభ్యర్థిని ఇంకా ఎంపిక చేయలేదు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఫ్రాన్స్, అమెరికా పర్యటనల తర్వాత ఎంపిక చేయాల్సింది.  రేపు ఉదయం బీజేపీ శాసనసభ పక్ష సమావేశం జరుగనుంది.  ఈ సమావేశంలోనే ముఖ్యమంత్రి అభ్యర్థిని ఎంపిక చేస్తారు.

ఆప్ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి అయిన అరవింద్ కేజ్రీవాల్ ని ఓడించిన పర్వేశ్ వర్మ గతంలో రెండు సార్లు ఎంపీ గా గెలిచారు.  ఈ సారి ఎం ఎల్ ఎ గా గెలిచారు.

ఆశిష్ సూద్ ఎప్పటినుండో భాజపా లో ఉన్నారు. ఆర్ ఎస్ ఎస్ తో అనుబంధం ఉంది. ఢిల్లీ రాజకీయాలలో అపార అనుభవం ఉంది. ఢిల్లీ బీజేపీ వైస్ ప్రెసిడెంట్ గా కూడా పని చేశారు

ఢిల్లీ సీఎం రేసులో ముఖ్యం గా మరో పేరు వినిపిస్తోంది. రేఖ గుప్తా విద్యార్థి జీవితం నుండి రాజకీయాలలో చురుగా పాల్గొనే రేఖ గుప్తా ఆర్ ఎస్ ఎస్, బీజేపీ తో పని చేసిన అనుభవం ఉంది.  బీజేపీ నార్త్ ఢిల్లీ కి మేయర్ గా పని చేసిని అనుభవం ఉంది. అంతే కాకుండా ప్రస్తుతం ఢిల్లీ బీజేపీ మహిళా మోర్చా జనరల్ సెక్రటరీ. 

ఢిల్లీ కి మహిళను సీఎం చేయాలి అనే సంచలన నిర్ణయం తీసుకుంటే బీజేపీ వినిపించే మరో మహిళా పేరు శిఖా రాయ్. వరసగా ఆప్ నుండి మూడు సార్లు గెలిచిన సౌరభ్ భరద్వాజ్ ను, ప్రస్తుతం బీజేపీ కౌన్సిలర్ గా ఉన్న శిఖ భరద్వాజ్ గ్రేటర్ కైలాష్ లో ఓడించారు. మున్సిపల్ కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ చైర్ పర్సన్ గా పని చేసిన అనుభవం ఉంది.

ప్రస్తుతం షార్ట్ లిస్ట్ చేసిన పేర్లలో పర్వేశ్ వర్మ, ఆశిష్ సూద్, శిఖ రాయ్, రేఖా గుప్త ఉన్నారు. అయితే మొదటి సారిగా ఢిల్లీ సీఎం గా మహిళా అభ్యర్థిని ప్రకటించాలనుకుంటే, రేఖ గుప్త, శిఖా రాయ్ లు ముందు వరసలో ఉంటారు.  వీరిద్దరిలో రేఖ గుప్తా కు ఎక్కువ అవకాశాలున్నాయి. శిఖా రాయ్ అవకాశాలను కూడా తోసిపారేయలేము

వీళ్ళెవరూ కాదని, వేరే ఎవరి పేరైన అనూహ్యం తెరమీదకు తెస్తారా అనేది రేపు తేలుతుంది