బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్, కోలీవుడ్ దిగ్గజ దర్శకుడు ఏఆర్ మురుగదాస్, కాంబినేషన్ లో వస్తున్న తాజా చిత్రం ‘సికందర్'(Sikandar). జై హో చిత్రం తర్వాత మురుగదాస్, సల్మాన్ ఖాన్ కాంబోలో ఈ మూవీ రానుండడంతో భారీ అంచనాలు ఉన్నాయి. 2025లో రిలీజ్ కానున్న మోస్ట్ ఎవైటెడ్ మూవీస్‌లో ‘సికందర్’ ఒకటి. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటివరకు విడుదలైన పోస్టర్స్, సాంగ్స్, టీజర్, ట్రైలర్ అన్నీ కూడా బ్లాక్‌బస్టర్ స్పందనను రాబట్టుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ఈద్ (రంజాన్) సందర్భంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ క్రమంలో ఇప్పటికే జోరుగా ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు మేకర్స్. ఉత్తరాదిన ఈ సినిమాకు మంచి హైప్ ఉన్నప్పటికీ దక్షిణాదిలో అంతగా ప్రభావం లేదు. అయితే తాజాగా ఈ మూవీ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్న సల్మాన్ ఖాన్ జాకబ్ & కో. ఎపిక్ ఎక్స్ రామ్ జన్మభూమి టైటానియం ఎడిషన్ 2 వాచ్‌ను ధరించి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఈ వాచీలో రాముడు, అయోధ్య రామమందిరం బొమ్మలు ఉన్నాయి. అయితే సల్మాన్ ధరించిన ఈ వాచ్ ధర ఎంతనేది సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.
విశ్వసనీయ సమాచారం ప్రకారం సల్మాన్ ఖాన్ (Salman Khan) ధరించిన రామ్ జన్మభూమి వాచ్ ధర దాదాపుగా రూ.34 లక్షలు ఉన్నట్లు తెలుస్తోంది. జాకబ్ కంపెనీ కో ఫౌండర్ జాకబ్ అరాబోతో సల్మాన్ ఖాన్ కు ఉన్న స్నేహం కారణంగా కొంత కాలంగా ఈ కంపెనీ వాచ్ లను ధరిస్తూ వాటికి కావల్సిన ప్రమోషన్స్ చేస్తున్నాడు సల్మాన్. ఇకపోతే సికిందర్ (Sikindar) సినిమాను రూ. 400 కోట్ల భారీ బడ్జెట్ తో నడియాద్వాలా గ్రాండ్‌సన్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై సాజిద్ నడియాద్వాలా నిర్మిస్తున్నారు. ఈ మూవీలో సల్మాన్కు జోడీగా నేషనల్ క్రష్ రష్మిక మందన్నా నటించింది. సత్యరాజ్, ప్రతీక్ బబ్బర్ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాకు సంతోష్ నారాయణ్ సంగీతం అందించగా.. రంజాన్ కానుకగా వరల్డ్ వైడ్ గా మార్చి 30న గ్రాండ్ రిలీజ్ కానుంది. ఇక గత కొంత కాలంగా సరైన హిట్ లేని సల్మాన్ ఖాన్ కు ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అందిస్తుందని సల్మాన్ ఖాన్ ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.

