ఆర్ ఆర్ ఆర్ – Beind and Beyond Documentary ప్రొమోషన్స్ లో భాగంగా జపాన్ వెళ్లిన ఏస్ డైరెక్టర్ రాజమౌళి అక్కడి మీడియాతో ముచ్చటించారు.
ఆర్ ఆర్ ఆర్ సినిమా మీద ఈ డాక్యుమెంటరి ని చేయడం ఆనందం కలిగించిందని చెప్పారు. ఆర్ ఆర్ ఆర్ సినిమాని ఆదరించినందుకు ప్రెకషలకు ధన్యవాదాలు తెలిపారు రాజమౌళి
ఈ సందర్భంగా మీడియా మీరు ఏ సినిమాల కోసం ఎదురు చూస్తున్నారు అని అడిగిన ప్రశ్నకు రాజమౌళి సమాధానమిస్తూ ప్రశాంత్ నీల్ (Prashanth Neel) దర్శకత్వంలో వస్తోన్న ఎన్టీఆర్ (NTR) డ్రాగన్ (Dragon) , సందీప్ రెడ్డి వంగ (Sandeep Reddy Vanga) దర్శకత్వంలో ప్రభాస్ (Prabhas) నటిస్తోన్న స్పిరిట్ (Spirit) మరియు బుచ్చిబాబు (Buchibabu) దర్శకత్వంలో రామ్ చరణ్ (Ram Charan) నటిస్తోన్న పెద్ది (Peddi) చిత్రాల కోసం ఒక ప్రేక్షకుడిగా ఎదురు చూస్తున్నానని తెలిపారు
అంతే కాకుండా రామ్ చరణ్, బుచ్చిబాబు దర్శకత్వంలో నటించిన పెద్ది Glimpse ఒక వారం క్రితమే విడుదలైందని మీడియా కు తెలిపారు
ఆర్ ఆర్ ఆర్ – Beind and Beyond Documentary నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ప్రస్తుతం రాజమౌళి, మహేష్ బాబు తో అంతర్జాతీయ స్థాయిలో సినిమాని నిర్మిస్తున్నారు

