‘హిట్‌ 3’ ట్రైలర్‌ లాంఛ్ ప్లేస్, టైం ఫిక్స్.. ఎక్క‌డంటే.?

by | Apr 13, 2025 | సినిమా

టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని, యంగ్ డైరెక్టర్ శైలేశ్‌ కొలను కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా ‘హిట్‌’: ది థర్డ్‌ కేస్‌’ ఫుల్ లెంగ్త్ క్రైమ్‌ థ్రిల్లర్​గా రూపొందనున్న ఈ మూవీలో అర్జున్‌ సర్కార్‌ అనే ఓ పవర్​ఫుల్ పోలీస్ ఆఫీసర్​గా నాని (Nani) కనిపించనున్నారు. కఠినత్వానికీ, కనికరం లేని తత్వానికి ప్రతీకగా ఆయన పాత్ర సాగుతుందని, ఇప్పటి వరకు నాని పోషించిన పాత్రలతో పోల్చితే ఈ పాత్ర చాలా డిఫరెంట్ గా ఉండనుందని అంటున్నారు.

వాల్‌పోస్టర్‌ సినిమా, యునానిమస్‌ ప్రొడక్షన్స్‌ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నారు. హిట్ 3 సినిమా వేసవి కానుకగా మే 1న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ పోస్టర్స్, టీజర్, సాంగ్స్ అన్నీ కూడా బ్లాక్‌బస్టర్ స్పందనను రాబట్టుకున్న విషయం తెలిసిందే. తాజాగా మేకర్స్‌ ట్రైలర్‌ (Trailer) లాంఛ్ అప్‌డేట్ అందించారు. ఈ హిట్ 3 సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను విశాఖపట్నంలో లాంఛ్ చేయనున్నట్టు ప్రకటించారు.

సోమవారం (ఏప్రిల్‌ 14న) వైజాగ్ లోని సంగం థియేటర్‌లో ఉదయం 10: 30 గంటలకు హిట్ 3 ట్రైలర్‌ను విడుదల చేయనున్నారు.
అలాగే సోషల్ మీడియాలో ఈ మూవీ ట్రైలర్‌ను 11:07 గంటలకు రిలీజ్ చేయనున్నారు. ఈ క్రమంలోనే ఓ పవర్ ఫుల్ విడియోని మేకర్స్ విడుదల చేశారు. అయితే ‘హిట్ 3’ మూవీ పాన్‌ ఇండియా రిలీజ్‌ కాబట్టి ఈ సారి కాస్త పెద్ద ఎత్తున ప్రమోషన్‌లు ప్లాన్‌ చేస్తున్నారట మేకర్స్. ప్రస్తుతం శరవేగంగా పోస్ట్‌ ప్రోడక్షన్‌ వర్క్స్‌ జరుగుతున్నాయి. ఇక హిట్ 3 సినిమాలో కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ (Karthi) స్పెషల్ రోల్ చేయనుండగా.. ఆయనే ‘హిట్‌ 4’ (HIT) లో హీరోగా చేయనున్నట్లు సమాచారం. దీన్ని ‘హిట్‌ 3’ చివర్లో రివీల్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే మూవీ క్లైమాక్స్ లో కార్తీ ఎంట్రీ ఉంటుందని సమాచారం.