నిన్న రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో రెండు రికార్డు లు నమోదయ్యాయి
నిన్నటి మ్యాచ్ లో తిలక్ వర్మ వికెట్ తీయడం ద్వారా భువనేశ్వర్ కుమార్ అత్యధిక వికెట్లు తీసిన ఫాస్ట్ బౌలర్ గా రికార్డు సృష్టించాడు. 183 వికెట్ల తో మొదటి స్థానంలో ఉన్న బ్రేవో ను అధికమించాడు. అయితే ఓవరాల్ గా అత్యధిక వికెట్ తీసిన బౌలర్ల జాబితాలో మాత్రం, 184 వికెట్లతో భువనేశ్వర్ కుమార్ మూడవ స్థానంలో ఉన్నాడు. 206 వికెట్లతో చాహల్ మొదటి స్థానంలో ఉండగా, పీయూష్ చావ్లా 192 వికెట్లతో రెండవ స్థానంలో ఉన్నాడు
నిన్నటి మ్యాచ్ లోనే విరాట్ కోహ్లీ టి 20 క్రికెట్లో 13000 పరుగులు చేసిన తొలి భారత క్రికెటర్ గా రికార్డు సృష్టించాడు. నిన్న రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో విరాట్ కోహ్లీ ఈ అరుదైన ఘనతను సాధించాడు
కోహ్లీ కన్నా ముందు టి 20 క్రికెట్ లో 13 వేల పరుగులు చేసిన వారు నలుగురు ఉన్నారు. క్రిస్ గేల్ 14562 పరుగులతో మొదటి స్థానంలో ఉండగా, 13610 పరుగులతో అలెక్స్ హేల్స్ రెండవ స్థానంలో ఉన్నాడు. 13557 పరుగులతో షోయబ్ మాలిక్ మూడవ స్థానంలో, 13537 పరుగులతో పోలార్డ్ నాలుగవ స్థానంలో ఉన్నారు. విరాట్ కోహ్లీ 13050 పరుగులతో ఐదవ స్థానంలో ఉన్నాడు. ఈ ఐపీల్ 2025 సీజన్ పూర్తి అయ్యేలోపు విరాట్ కోహ్లీ రెండవ స్థానానికి రావడం ఖాయంగా కనిపిస్తోంది

