అధికారం…నిజం….రైడ్ 2 ట్రైలర్ చూశారా

by | Apr 8, 2025 | సినిమా

పనోరమా స్టూడియో ప్రౌడక్షన్ వారు నిర్మిస్తోన్న చిత్ర రైడ్ 2.  అజయ్ దేవగన్ ఈ చిత్రంలో కధానాయకుడు.  దర్శకుడు రాజ్ కుమార్ గుప్తా క్రైమ్ థ్రిల్లర్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లుగా తెలుస్తోంది. ఇంకా ఈ చిత్రంలో రితేష్ దేశముఖ్, వాణి కపూర్ తదితరులు నటించారు

2018 లో విడుదలై సూపర్ హిట్ అయిన రైడ్ చిత్రానికి సీక్వెల్ గా వస్తోన్న ఈ రైడ్ 2 ని మే 1 విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ చిత్ర ట్రైలర్ ని విడుదల చేశారు

ఒక వైపు అధికార, మరోవైపు నిజం. ఇప్పుడు ఈ రైడ్ మరింత పెద్దది అయింది అని అజయ్ దేవగన్ ఎక్స్ లో పోస్ట్ చేశారు.