‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’ సెన్సార్‌ రిపోర్ట్?

by | Apr 8, 2025 | సినిమా

టాలీవుడ్ సీనియర్ హీరో నందమూరి కళ్యాణ్ రామ్ కథానాయకుడిగా ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’. ఇందులో సాయి మంజ్రేకర్ హీరోయిన్‌గా నటిస్తోంది. భారీ బడ్జెట్ తో ముప్పా వెంకయ్య చౌదరి సమర్పణలో అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకాలపై అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు నిర్మిస్తున్నారు. లేడీ సూపర్ స్టార్ విజయశాంతి పవర్ ఫుల్ పోలీస్ అధికారిణిగా నటిస్తున్న ఈ సినిమాలో ఆమె కొడుకుగా కళ్యాణ్ రామ్ నటిస్తున్నాడు. ఇటీవల ఈ సినిమా నుంచి మేకర్స్ ఫస్ట్ లుక్ పోస్టర్స్, టీజర్, సాంగ్స్ రిలీజ్ చేయగా అభిమానుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ లభించింది. ఈ చిత్రానికి అజనీష్‌ లోక్‌నాథ్‌ మ్యూజిక్‌, బ్యాక్‌ గ్రౌండ్ స్కోర్‌ అందిస్తున్నాడు. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ సినిమా వేసవి కానుకగా ఏప్రిల్‌ 18న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే చిత్ర యూనిట్ మరో అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చారు. తాజాగా ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’ సినిమా సెన్సార్ కార్యక్రమాలు ముగిసినట్లు ప్రకటించారు.

ఈ చిత్రానికి సెన్సార్ వారు యూ/ఏ సర్టిఫికేషన్ ఇచ్చినట్లు చిత్ర యూనిట్ అధికారికంగా వెల్లడించారు. ఈ క్రమంలోనే స్పెషల్ పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు. ఇక ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’ (Arjun S/o Vijayanthi) సినిమా క్రేజీ రన్ టైమ్ లాక్ చేసుకుంది. ఫుల్ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రానికి 2 గంటల 24 నిమిషాల సాలిడ్ రన్‌ టైం ఫిక్స్ చేశారని సమాచారం. యాక్షన్ ఎంటర్టైనర్ కు ఇది సరైన రన్ టైం అనే అనుకోవాలి. ఇది తల్లీ కొడుకుల బలమైన భావోద్వేగాల నేపథ్యంలో సాగే యాక్షన్ మూవీ అని సెన్సార్ రిపోర్ట్ ద్వారా తెలుస్తోంది. సినిమా మొదలైనప్పటి నుంచి ఎక్కడా బోర్ కొట్టకుండా స్క్రీన్ ప్లే సాగిందని సమాచారం. అలాగే సెన్సార్ టాక్ కూడా చాలా పాజిటివ్ గా ఉందని అంటున్నారు. కళ్యాణ్ రామ్ (Kalyan Ram) కెరీర్ లోనే బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చాడని, విజయశాంతి (Vijaya Shanthi) మరోసారి అదరగొట్టారని సమాచారం. ప్రదీప్ చిలుకూరి టేకింగ్, అజనీష్‌ లోక్‌నాథ్‌ మ్యూజిక్ కూడా హైలైట్స్ గా నిలిచాయని చెబుతున్నారు. ఇదిలాఉంటే.. ఈ సినిమా డిజిటల్ రైట్స్ భారీ ధరకు అమ్ముడుపోయినట్లు తెలుస్తోంది. అలాగే తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా కొనేందుకు బయ్యర్లు ఆసక్తి చూపిస్తున్నట్లు సమాచారం. కాగా, ఈ సినిమాలో శ్రీకాంత్, సాయి మంజ్రేకర్, యానిమల్ ఫేమ్ పృథ్వీరాజ్ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకు తమ్మిరాజు ఎడిటర్‌గా ఉండగా, రామ్ ప్రసాద్ సినిమాటోగ్రాఫర్‌గా ఉన్నారు