మాజీ మంత్రి, ఏం ఎల్ ఎ ఆర్ కే రోజా (Roja) మళ్ళీ టెలివిజన్ బాట పట్టారు. గత అసెంబ్లీ ఎన్నికలలో వైస్సార్సీపీ పార్టీ ఘోరంగా ఓడిపోయింది. అంతే కాకుండా నగరి నుండి రోజా కూడా ఘోరం గా ఓడిపోయారు
ప్రస్తుతం రాజకీయాలలో రోజా పాత్ర పెడదాం ఏమి లేదు. ఏం ఎల్ ఎ గా గెలిచికుంటే కనీసం అసెంబ్లీ కి వెళ్లాల్సి వచ్చేది. ఏం ఎల్ ఏ గా గెలవకపోవడంతో ప్రస్తుతం రాజకీయాలతో రోజా కు పెద్దగా పని ఏమి లేదు. అప్పుడప్పుడు వైస్సార్సీపీ ప్రతినిధిగా అధికార పార్టీ మీద మాట్లాడడం తప్ప. ఇటువంటి సందర్భంలో మళ్ళీ టెలివిజన్ వైపు మొగ్గు చుపుతున్నారు రోజా. అంతకు ముందు ఈటీవీ జబర్దస్త్ (ETV Jabardasth) లో జడ్జి గా కనిపించారు
అంతకు ముందు, మంత్రి పదవి వచ్చిన తరవాత రోజా ఈటీవీ జబర్దస్త్ కు గుడ్ బాయ్ చెప్పారు. ప్రస్తుతానికి ఏ పదవి లేకపోవడంతో మళ్లీ టెలివిజన్ బాట పట్టారు. జీ తెలుగు లో మార్చ్ 2 నుండి ప్రసారమయ్యే సూపర్ సీరియల్ ఛాంపియన్ షిప్ (Super Serial Championship) లో రోజా జడ్జి గా వ్యవరిస్తున్నారు. ఇదే షో లో శ్రీకాంత్, రాశి లు కూడా జడ్జిలు గా వ్యవహరించబోతున్నారు
ఈ సూపర్ సీరియల్ ఛాంపియన్ షిప్ లో సంక్రాంతికి వస్తున్నాం (Sankranthiki Vastnunnam) మూవీ సీన్ల ను రీ క్రియేట్ చేశారు

