సందీప్‌కిషన్ హీరోగా, ‘ధమాకా’ ఫేమ్ నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మజాకా’. రావురమేష్ కీలక పాత్ర పోషించిన ఈ చిత్రంలో రీతూవర్మ, అన్షూ కథానాయికలుగా నటించారు. ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్ టైన్ మెంట్స్, హాస్య మూవీస్, జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. శివరాత్రి సందర్భంగా ఫిబ్రవరి 26న విడుదలైంది. లవ్ అండ్ కామెడీ బ్యాక్‌డ్రాప్‌లో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా తొలి రోజు మిశ్రమ స్పందన అందుకుంది. తాజాగా ఈ సినిమా ఓటీటీ డిటైల్స్ ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారాయి. తాజా సమాచారం ప్రకారం ‘మజాకా’ మూవీ ఓటీటీ డీల్ చాలారోజుల క్రితమే పూర్తయినట్లు తెలుస్తోంది.
ప్రముఖ ఓటీటీ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ జీ5 మంచి రేటుకే డిజిటల్ రైట్స్ దక్కించుకున్నట్లు సమాచారం. మజాకా మూవీ థియేటర్లలో విడుదలైన ఐదు వారాల తర్వాత ఓటీటీలో స్ట్రీమింగ్ చేసేలా డీల్ జరిగిందని తెలుస్తోంది. ఈ లెక్కన ఏప్రిల్ మొదటి వారంలో మాజాకా మూవీ జీ5లో స్ట్రీమింగ్ అయ్యే అవకాశముంది. ఇక మజాకా సినిమా కథ విషయానికొస్తే.. సందీప్ కిషన్, రావు రమేశ్ తండ్రీ కొడుకుల పాత్రల్లో కనిపించారు. కొడుకు ఒక అమ్మాయితో ప్రేమలో ఉండగా.. తండ్రి మరో అమ్మాయితో ప్రేమలో పడటం అనేది ఆసక్తికరంగా ఉంది. వీరికి జోడీగా రీతూ వర్మ, అన్షు నటించారు. వీరిద్దరి ప్రేమలో ఎలాంటి మలుపులు చోటు చేసుకున్నాయి అనేదే సినిమా కథ. దర్శకుడు త్రినాథరావు నక్కిన, డైలాగ్ రైటర్ ప్రసన్న కుమార్ కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమాలో రొటీన్ కథకి బలమైన కామెడీ సన్నివేశాలను రాసుకొని తెరకెక్కించగా అది కాస్త బెడిసి కొట్టిందనే చెప్పాలి.

