‘చావా’ సినిమా తెలుగులో విడుదల ఈ రోజే

by | Feb 26, 2025 | సినిమా

ఇటీవల బాలీవుడ్ లో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అయినా చావా తెలుగు లో కూడా విడుదలవుతోంది

తెలుగు ప్రేక్షకుల డిమాండ్ మేరకు చావా సినిమాను మార్చ్ 7 న తెలుగులో విడుదల చేస్తున్నారు.  గీతా ఆర్ట్స్ వారు, చావా సినిమాని తెలుగులో డిస్ట్రిబ్యూషన్ చేయనున్నారు

 శంభాజీ మహారాజ్ పాత్రలో విక్కీ కౌశల్ నటనకు సర్వత్రా ప్రశంసలు దక్కుతున్నాయి. శంభాజీ మహారాజ్ భార్య, యేసు భాయ్ పాత్రలో రష్మిక మందన నటించింది.

శివాజీ సావంత్ రాసిన చావా అనే నవల ఆధారం గా తీసిన చిత్రం ఈ చావా. మరాఠా ఛత్రపతి శంభాజీ మహారాజ్ జీవితమే ఈ చావా

లక్ష్మణ్ ఉఁటేకర్ దర్శకత్వం వహించిన చావా సినిమా మద్దోక్ ఫిలిమ్స్ నిర్మించింది. ఏ ఆర్ రెహ్మాన్ నేపధ్య సంగీతాన్ని అందించారు

ఛత్రపతి శివాజీ మరణించిన తరవాత మరాఠా సామ్రాజ్యం ఒక్కసారిగా డీలా పడిపోతుంది.  ఇదే సరైన సమయం అని భావించిన  మొఘల్ చక్రవర్తి  ఔరంగజేబు ఎలాగైనా మరాఠా సామ్రాజాన్ని జయించాలని చూస్తాడు. అయితే మొఘల్ చక్రవర్తి  ఔరంగజేబుకు ఊహించని విధంగా ఛత్రపతి శంభాజీ మహారాజ్ నుండి ప్రతిఘటన వస్తుంది. అయితే ఛత్రపతి శంభాజీ మహారాజ్, ఔరంగజేబుని ఎలా ఎదుర్కొన్నాడు.  తన రాజ్యాన్ని ఎలా కాపాడుకున్నాడు అనేదే ఈ చిత్రకథ