రాబిన్ హుడ్ ట్రైలర్ విడుదల ; చివర్లో డేవిడ్ వార్నర్ ఎంట్రీ

by | Mar 23, 2025 | సినిమా

టాలీవుడ్ యంగ్ హీరో నితిన్, బ్యూటీ క్వీన్ శ్రీలీల హీరో, హీరోయిన్లుగా వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘రాబిన్‌హుడ్‌’.చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మిస్తోంది. నవీన్‌ యేర్నేని, రవి శంకర్ నిర్మాతలకుగా వ్యవహరిస్తున్నారు. జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతాన్ని అందిస్తున్నారు. వినోదం, సందేశంతో కూడిన యాక్షన్‌ థ్రిల్లర్‌గా ఈ సినిమాను రూపొందిస్తున్నారు.

ఈ రాబిన్ హుడ్ సినిమా ట్రైలర్ ను ఈ రోజు విడుదల చేశారు. రాబిన్ హుడ్ ట్రైలర్ చూస్తే వెంకీ కుడుముల గత చిత్రాలు చలో, బీష్మ రేంజ్ వినోదం లేదనిపిస్తోంది. ట్రైలర్ చివరలో డేవిడ్ వార్నర్ ఎంట్రీ చూపించారు

ఈ సినిమాలో ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్‌ వార్నర్‌ కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా మార్చి 28న ఉగాది కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది