రాణించిన ఋతురాజ్ గైక్వాడ్, రచిన్ రవీంద్ర ; సి ఎస్ కె విక్టరీ

by | Mar 23, 2025 | వార్తలు

రాణించిన ఋతురాజ్ గైక్వాడ్, రచిన్ రవీంద్ర ; సి ఎస్ కె ఘన విజయం

ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా, చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో , చెన్నై సూపర్ కింగ్స్ నాలుగు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది

156 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు 11 పరుగుల వద్ద ఓపెనర్ రాహుల్ త్రిపాఠి వికెట్ కోల్పోయింది

అయితే తరవాత వచ్చిన కెప్టెన్ ఋతురాజ్ గైక్వాడ్ తో కలిసి మరో ఓపెనర్ రచిన్ రవీంద్ర రెండవ వికెట్ కు 67 పరుగులు జోడించారు.  ధాటిగా ఆడిన కెప్టెన్ ఋతురాజ్ గైక్వాడ్ కేవలం 26 బంతుల్లో మూడు సిక్సర్లు, ఆరు ఫోర్ల సాయంతో 53 పరుగులు చేశాడు.

ఋతురాజ్ గైక్వాడ్ అవుట్ అయిన తరవాత చెన్నై సూపర్ కింగ్స్ క్రమం తప్పకుండ వికెట్లు కోల్పోతూ వచ్చింది. అయితే మరోవైపు ఓపెనర్ రచిన్ రవీంద్ర మాత్రమ్ ఆచి తూచి ఆడుతూ స్కోర్ బోర్డు ను రవీంద్ర జడేజా సాయం తో కదిలించ సాగాడు. వీరిద్దరూ కలిసి ఆరవ వికెట్ కు 36 పరుగులు జోడించారు

విగ్నేష్ పుతూర్ వేసిన ఇన్నింగ్స్ 18 వ ఓవర్ లో రచిన్ రవీంద్ర రెండు సిక్స్ లు కొట్టి మ్యాచ్ ను పూర్తిగా చెన్నై సూపర్ కింగ్స్ కంట్రోల్ లోకి తెచ్చాడు.  అయితే 17 పరుగులు చేసిన జడేజా లేని పరుగుకు ప్రయత్నించి రన్ అవుట్ అయ్యాడు

ఆ తరవాత క్రీజ్ లో కి వచ్చిన మిస్టర్ కూల్ కేవలం రెండు బంతులు మాత్రమే ఆడాడు. సాంట్నర్ వేసిన 20 వ ఓవర్ మొదటి బంతికి రచిన్ రవీంద్ర సిక్స్ కొట్టి మ్యాచ్ ని గెలిపించాడు.  ఓపెనర్ గా వచ్చిన రచిన్ రవీంద్ర చివర వరకు నిలబడి 45 బంతుల్లో నాలుగు సిక్సర్లు, రెండు ఫోన్ల సాయంతో 65 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.

చెన్నై సూపర్ కింగ్స్ 19.1 ఓవర్ల లో 6 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసి, ఇంకా 5 బంతులు మిగిలి ఉండగానే  లక్ష్యాన్ని ఛేదించింది

 ముంబై ఇండియన్స్ బౌలర్ల లో విగ్నేష్ పుతూర్ మూడు వికెట్ లు తీయగా, దీపక్ చాహర్, విల్ జాక్స్ చెరో ఒక వికెట్ తీశారు

అంతకు ముందు టాస్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ ఫీల్డింగ్ ఎంచుకుంది

మొదట బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ జట్టు 20 ఓవర్ల లో 9 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది

హిట్ మాన్ రోహిత్ శర్మ డక్ అవుట్ అయ్యాడు. మరో ఓపెనర్ రికెల్టన్ 13 పరుగులు, వన్ డౌన్ లో వచ్చిన  విల్ జాక్స్ 11 పరుగులు చేసి వెంట వెంటనే అవుట్ అయ్యారు. ముంబై ఇండియన్స్ 36 పరుగులకే 3 కీలక వికెట్లను కోల్పోయింది

కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ లు నాలుగవ వికెట్ కు 51 పరుగులు జోడించారు.  సూర్య కుమార్ యాదవ్ 29 పరుగులు, తిలక్ వర్మ 31 పరుగులు చేసి అవుట్ అయ్యారు.

సూర్య కుమార్ యాదవ్ ను నూర్ అహ్మద్ బౌలింగ్ లో ధోని చేసిన మెరుపు స్టంపింగ్ ఒకప్పటి ధోని ని గుర్తుకు తెచ్చింది.  సూర్య కుమార్ యాదవ్ అవుట్ అయ్యిన తరవాత ముంబై ఇండియన్స్ క్రమం తప్పకుండా వికెట్లను కోల్పోతూ వచ్చింది

చివర్లో దీపక్ చాహర్ ధాటిగా ఆడి 15 బంతుల్లో రెండు ఫోర్లు, రెండు సిక్సర్ల సాయంతో 28 పరుగులు చేయడంతో ముంబై ఇండియన్స్ 155 పరుగుల గౌరవప్రదమైన స్కోర్ చేసింది.  చెన్నై పిచ్ ల మీద ఈ స్కోర్ పెద్దదే

చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్ల లో స్పిన్నర్ నూర్ అహ్మద్ 4 ఓవర్లు బౌలింగ్ చేసిన 18 పరుగులు ఇచ్చి 4 వికెట్లు తీసుకున్నాడు.  ఖలీల్ అహ్మద్ మూడు వికెట్లు తీయగా, ఎల్లిస్, అశ్విన్ లు చెరో ఒక వికెట్ తీశారు