ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా, చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య జరుగుతోన్న మ్యాచ్ లో టాస్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ ఫీల్డింగ్ ఎంచుకుంది
మొదట బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ జట్టు 20 ఓవర్ల లో 9 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది
హిట్ మాన్ రోహిత్ శర్మ డక్ అవుట్ అయ్యాడు. మరో ఓపెనర్ రికెల్టన్ 13 పరుగులు, వన్ డౌన్ లో వచ్చిన విల్ జాక్స్ 11 పరుగులు చేసి వెంట వెంటనే అవుట్ అయ్యారు. ముంబై ఇండియన్స్ 36 పరుగులకే 3 కీలక వికెట్లను కోల్పోయింది
కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ లు నాలుగవ వికెట్ కు 51 పరుగులు జోడించారు. సూర్య కుమార్ యాదవ్ 29 పరుగులు, తిలక్ వర్మ 31 పరుగులు చేసి అవుట్ అయ్యారు.
సూర్య కుమార్ యాదవ్ ను నూర్ అహ్మద్ బౌలింగ్ లో ధోని చేసిన మెరుపు స్టంపింగ్ ఒకప్పటి ధోని ని గుర్తుకు తెచ్చింది. సూర్య కుమార్ యాదవ్ అవుట్ అయ్యిన తరవాత ముంబై ఇండియన్స్ క్రమం తప్పకుండా వికెట్లను కోల్పోతూ వచ్చింది
చివర్లో దీపక్ చాహర్ ధాటిగా ఆడి 15 బంతుల్లో రెండు ఫోర్లు, రెండు సిక్సర్ల సాయంతో 28 పరుగులు చేయడంతో ముంబై ఇండియన్స్ 155 పరుగుల గౌరవప్రదమైన స్కోర్ చేసింది
చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్ల లో స్పిన్నర్ నూర్ అహ్మద్ 4 ఓవర్లు బౌలింగ్ చేసిన 18 పరుగులు ఇచ్చి 4 వికెట్లు తీసుకున్నాడు. ఖలీల్ అహ్మద్ మూడు వికెట్లు తీయగా, ఎల్లిస్, అశ్విన్ లు చెరో ఒక వికెట్ తీశారు

