‘రాబిన్‌హుడ్‌’ టీం భారీ ప్లాన్.. ప్రీ రిలీజ్ ఈవెంట్​ చీఫ్ గెస్ట్ అతడే!

by | Mar 20, 2025 | సినిమా

టాలీవుడ్ యంగ్ హీరో నితిన్, బ్యూటీ క్వీన్ శ్రీలీల హీరో, హీరోయిన్లుగా వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘రాబిన్‌హుడ్‌’.చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మిస్తోంది. నవీన్‌ యేర్నేని, రవి శంకర్ నిర్మాతలకుగా వ్యవహరిస్తున్నారు. జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతాన్ని అందిస్తున్నారు. వినోదం, సందేశంతో కూడిన యాక్షన్‌ థ్రిల్లర్‌గా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. సాయి శ్రీరామ్‌ ఛాయాగ్రాహకుడిగా వ్యవహరిస్తున్నారు. భీష్మ సినిమా త‌ర్వాత నితిన్ (Nitin) – వెంకీ కుడుముల కాంబినేష‌న్‌లో ఈ సినిమా వ‌స్తుండ‌టంతో ప్రేక్ష‌కుల‌లో భారీ అంచ‌నాలు ఉన్నాయి. ఇప్ప‌టికే మువీ నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్స్, టీజ‌ర్‌ను రిలీజ్ చేయ‌గా ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకున్నాయి. కాగా, ఈ సినిమాలో ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్‌ వార్నర్‌ కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా మార్చి 28న ఉగాది కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో మేకర్స్ ప్రమోషన్లలో వేగం పెంచారు.

అయితే తాజాగా రాబిన్‌హుడ్‌కు (Robinhood) సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్, సన్ రైజర్స్ మాజీ సారథి డేవిడ్ వార్నర్ హాజరు కానున్నట్లు తెలుస్తోంది. హైద్రాబాద్ లో జరగనున్న ఈ ఈవెంట్‌కు కావాల్సిన అనుమతులు ఇప్పటికే లభించగా.. శరవేగంగా ఏర్పాట్లు జరుగుతున్నట్లు తెలుస్తోంది. డేవిడ్ వార్నర్ వస్తుండడంతో ఈ కార్యక్రమానికి భారీగా ఫ్యాన్స్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి అందుకు తగిన ఏర్పాట్లు మేకర్స్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవలే ఈ సినిమాలోని వార్నర్ ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ సైతం రిలీజ్‌ చేశారు మేకర్స్ అందులో వార్నర్‌ షార్ట్‌ హెయిర్‌ మాస్ ఎక్స్‌ప్రెషన్స్‌తో అదరగొట్టాడు. ఇక ఈ సినిమాలో తన పాత్ర కోసం డేవిడ్ వార్నర్‌ భారీగానే రెమ్యునరేషన్‌ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో వార్నర్‌ పోషించేది చిన్న పాత్రే అయినా అతనికి ఉన్న క్రేజ్ దృష్ట్యా భారీ మొత్తంలో పారితోషికం అందించారట మేకర్స్.

ఈ సినిమాలో నటించినందుకుగానూ రూ.3 కోట్లు ప్రమోషన్స్‌లో పాల్గొనేందుకు రూ.1 కోటి మొత్తంగా రూ. 4కోట్లు వార్నర్ రెమ్యునరేషన్ గా అందుకున్నట్లు సమాచారం. ఇదిలాఉంటే.. డేవిడ్ వార్నర్ లాంటి వరల్డ్ క్లాస్ క్రికెటర్ తెలుగు సినిమా ద్వారా చిత్రసీమలోకి ఎంట్రీ ఇస్తుండడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గతంలో సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ గా ఉన్న డేవిడ్ వార్నర్ (David Warner) సోషల్ మీడియాలో తెలుగు హీరోల డైలాగులు చెబుతూ రీల్స్ చేసిన సంగతి తెలిసిందే. బాహుబలి, పుష్ప, డీజే టిల్లు అంటూ పలువురు తెలుగు హీరోల స్టైల్‌ను అనుకరిస్తూ తెలుగు ప్రేక్షకులను అలరించాడు.