మాటలు రావడం లేదు అన్న మెగాస్టార్ చిరంజీవి

by | Mar 20, 2025 | వార్తలు

మొదటిసారి బ్రిటన్ పార్లమెంటు భవనమైన హౌస్ ఆఫ్ కామన్స్‌లో జరిగిన ఈ కార్యక్రమం పై మెగా స్టార్ చిరంజీవి స్పందించారు

పార్లమెంటు భవనమైన హౌస్ ఆఫ్ కామన్స్‌లో ఇంత మంది మంత్రులు, సెక్రటరీలు, పార్లమెంట్ సభ్యులముందు నన్ను సత్కరించడం, మీరు నా గురించిన మాట్లాడిన మాటలతో నా హృదయం కృతజ్ఞత భావం తో నిండిపోయింది అని మెగా స్టార్ చిరంజీవి ఎక్స్ లో పోస్ట్ చేశారు

నన్ను ప్రేమించే అందరికి, నా బ్లడ్ బ్రదర్స్ కి, సిస్టర్స్ కి, నా సినీ కుటుంబానికి, నా శ్రేయోభిలాషులకు, నా స్నేహితులకు, నా కుటుంబ సబ్యులకు అందరికి నా హృదయ పూర్వక ధన్యవాదాలు అని అన్నారు

అంతకు ముందు, చిరంజీవికి యూకే పార్ల‌మెంట్‌లోని గ్రూప్ ఆఫ్ ఎంపీలు కలిసి లైఫ్ టైమ్ అఛీవ్‌మెంట్‌తో సత్కరించారు. యూకే అధికార లేబ‌ర్ పార్టీ ఎంపీ న‌వేందు మిశ్రా ఆధ్వ‌ర్యంలో ఈ వేడుక అంగరంగ వైభవంగా జ‌రిగింది. బ్రిటన్ పార్లమెంటు భవనమైన హౌస్ ఆఫ్ కామన్స్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో పార్ల‌మెంట్ స‌భ్యులు సోజ‌న్ జోసెఫ్‌, బాబ్ బ్లాక్ మ‌న్ తో పాటుగా రాజకీయ ప్రముఖులు, సినీతారలు, అభిమానులు పాల్గొన్నారు

సినీ రంగంలో నాలుగు దశాబ్దాలుగా చిరంజీవి అందిస్తున్న సేవలకు ఈ అవార్డు అందించినట్లు యూకే పార్లమెంటు వెల్లడించింది