పనోరమా స్టూడియో ప్రౌడక్షన్ వారు నిర్మిస్తోన్న చిత్ర రైడ్ 2. అజయ్ దేవగన్ ఈ చిత్రంలో కధానాయకుడు. దర్శకుడు రాజ్ కుమార్ గుప్తా క్రైమ్ థ్రిల్లర్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లుగా తెలుస్తోంది. ఇంకా ఈ చిత్రంలో రితేష్ దేశముఖ్, వాణి కపూర్ తదితరులు నటించారు
ఈ చిత్రంలో తమన్నా ఒక స్పెషల్ సాంగ్ లో నటించింది. నషా నషా అంటూ సాగే ఈ పాటను మేకర్స్ విడుదల చేశారు. ఈ పాటలో తమన్నా తన స్టెప్ లతో కుర్రకారును ఒక ఊపు ఊపుతోంది
2018 లో విడుదలై సూపర్ హిట్ అయిన రైడ్ చిత్రానికి సీక్వెల్ గా వస్తోన్న ఈ రైడ్ 2 ని మే 1 విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇంతకు ముందు ఈ చిత్ర ట్రైలర్ ని కూడా విడుదల చేశారు.

