కధ లేకుండానే మైత్రి మూవీ మేకర్స్ హిట్ కొట్టేశారు
నితిన్ నటించిన రాబిన్ హుడ్ ఘోర పరాజయం తరవాత మైత్రి మూవీ మేకర్స్ వారు తమిళ్, హిందీ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. తమిళం లో అజిత్ తో తీసిన గుడ్, బాడ్, అగ్లీ సినిమా, హిందీ లో సన్నీడియోల్ తో జాట్ సినిమాతో ఈ ఏప్రిల్ 10 న వచ్చారు
గుడ్ బాడ్ అగ్లీ, జాట్ – ఈ రెండు సినిమాల మధ్య కొన్ని పోలికలు ఉన్నాయి
ఈ రెండు సినిమాలలో హీరో లు ఇద్దరు ఇండస్ట్రీ లో సీనియర్ హీరోలు ఒకరు అజిత్ మరొకరు సన్నీడియోల్. వీళ్లిద్దరికీ ఒక ఫ్యాన్ బేస్ ఎప్పటినుండో ఉంది
ఇక ఈ రెండు సినిమాలలో కధ పాతదే, కొత్తదనం ఏమి లేదు
ఈ రెండు సినిమాలు ఆయా హీరో అభిమానులను అలరిస్తాయి అనడంలో సందేహం లేదు.
స్టైల్, స్వాగ్, హీరో ఎలేవేషన్స్, పవర్ ఫుల్ డైలాగు ల తో సినిమాని ఆసక్తి కరంగా మార్చారు దర్శకుడీలు
ఈ రెండు సినిమాలు విడుదలైన సమయంలో వేరే ఏ సినిమాలు పోటీలో లేవు అటు బాలీవుడ్ లో ఇటు తమిళ్ నాడు లో. సమ్మర్ హాలిడేస్ కాబట్టి వర్డ్ అఫ్ మౌత్ టాక్ బాగానే వచ్చింది. బుక్ మై షో లో పబ్లిక్ రేటింగ్ ఈ రెండు సినిమాలకు 9 కి పైగా ఇచ్చారు. కాబట్టి మైత్రి మూవీ మేకర్స్ వారు ఈ రెండు సినిమాలతో డబ్బులు చేసుకునే అవకాశాలు బాగా ఉన్నాయి
అయితే మొదటి రెండు వారాంతపు సెలవుల వసూళ్ల బట్టి ఈ రెండు సినిమాలు ఏ రేంజ్ హిట్ అనేది తెలుస్తుంది. తెలుగు నిర్మాతలు తమిళ్, హిందీ భాషలలో ఒక రోజు సినిమాలు విడుదల చేసి హిట్ కొట్టారు.
ఈ రోజు ప్రదీప్ మాచిరాజు, దీపికా నటించిన అక్కడ అమ్మాయి, ఇక్కడ అబ్బాయి సినిమా ని కూడా మైత్రి మూవీ మేకర్స్ వారు విడుదల చేస్తున్నారు.
ప్రస్తుతం మైత్రి మూవీ మేకర్స్ హవా తెలుగులోనే కాదు భారత దేశం అంతటా వ్యాపించింది. ఈ మధ్య నే పుష్ప 2 ఇండియా లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు

